వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మీడియానే ప్రజల శత్రువు, నా పాలన బాగుంది, ఘర్షణలు లేవు'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా ప్రజలకు ప్రధమ శత్రువు మీడియానే అని ఆయన ఆరోపించారు. అమెరికాలో తన పాలన బాగుందని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమెరికా:అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలు వివాదాస్పదమౌతున్నాయి. అయితే ఆది నుండి ఆయన తీరు మీడియాకు వ్యతిరేకంగానే ఉంది.అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడ ఆయన ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నాడు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అవకాశం వచ్చినప్పుడల్లా మీడియాకు వ్యతిరేకంగా తన గళం విప్పుతూనే ఉన్నారు.

ఎన్నికల ప్రచార సమయంలో కూడ మీడియాపై ట్రంప్ తన అసహనాన్ని ప్రదర్శించిన ఘటనలు కూడ చోటుచేసుకొన్నాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడ ఇదే రకంగా ఆయన వ్యవహరశైలి ఉంది.

ప్రత్యక్షంగానూ, పరోక్షంగానో, సోషల్ మీడియాను వేదికగా చేసుకోనో ట్రంప్ మీడియాపై తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.

మీడియా అమెరికా ప్రజల శత్రువు

మీడియా అమెరికా ప్రజల శత్రువు


మీడియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసును వెళ్ళగక్కారు. మీడియా అమెరికా ప్రజల శత్రువని ఆయన వ్యాఖ్యానించారు. ' ఫేక్ న్యూస్ మీడియా శత్రువు' అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన తన అక్కసును వెళ్ళగక్కారు.నిజాయితీ లేని మీడియా చేస్తోన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన మీడియాపై నిప్పులు చెరిగారు.

పాలన సజావుగానే ఉంది.

పాలన సజావుగానే ఉంది.

అమెరికాలో తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలన తీరుపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

ఆయన కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి ఆయన విమర్శలు గుప్పించారు.వైట్ హౌజ్ లో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదన్నారు. గందరగోళం చెలరేగుతోందని మీడియాలో వస్తోన్న కథనాలతో టీవీ చానల్స్ పెట్టాలన్నా...వార్తా పత్రికలు చదవాలన్నా ఇబ్బందిగా ఉందన్నారు ట్రంప్.

సోషల్ మీడియా వేదికగా మీడియాపై విమర్శలు

సోషల్ మీడియా వేదికగా మీడియాపై విమర్శలు

మీడియాపై తన అక్కసును సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సామాజిక వైబ్ సైట్లను ఆయన ఉపయోగిస్తున్నారు.


తన పాలన తీరుపై చాలా మది ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నారు.గతంలో అమెరికా అధ్యక్షులుగా
పనిచేసినవారు మీడియాపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాని, ట్రంప్ తరహలో మాత్రం బహిరంగంగా ఆరోపణలు మాత్రం చేయలేదు.


ఇదే సమయంలో ఫాక్స్ న్యూస్ నిర్వహించిన ఓపీనియన్ పోల్ లో మీడియా కంటేట వైట్ హౌస్ నిజాయితీ కలిగిందని భావిస్తున్న వారి సంఖ్య 45 నుండి 42 శాతానికి తగ్గింది.

ఇజ్రాయిల్ ప్రధానికి ట్రంప్ ఆహ్వానం

ఇజ్రాయిల్ ప్రధానికి ట్రంప్ ఆహ్వానం

ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొని తుదముట్టిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.


ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహున్ ను అమెరికాకు రావాలని ఆహ్వానించినట్టుగా ట్రంప్ రేడియో ద్వారా అమెరికా ప్రజలకు చెప్పారు.ఇజ్రాయిల్ తో కలిసి పనిచేస్తామన్నారు. అమెరికా ప్రజలకు ఇచ్చిన హమీని నిలబెట్టుకొంటామని ఆయన ప్రకటించారు.

నిక్కీ హేలీ సమర్థంగా పనిచేస్తున్నారు.

నిక్కీ హేలీ సమర్థంగా పనిచేస్తున్నారు.


ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ సమర్థంగా పనిచేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు.

అమెరికాలో ఒక భారతీయ అమెరికన్ కేబినెట్ స్థాయి పదవిని దక్కించుకొంది నిక్కీ హేలీ.ఆమె కొద్ది వారాలుగా కొత్త పదవిలో పనిచేస్తున్నారు. మన కోసం సమర్థంగా పనిచేస్తోన్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీకి ధన్యవాదాలు అంటూ ట్రంప్ చెప్పారు.అమెరికా రాయబారిగా ఆమె ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు.

వారం రోజులకే ప్రతిష్ట ఇలా...

వారం రోజులకే ప్రతిష్ట ఇలా...

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకొన్న నిర్ణయాలతో గందరగోళం చేలరేగింది.

కొన్ని దేశాల ప్రజలపై బ్యాన్ విధించడం,ఐటి సంస్థల పై ట్రంప్ తీసుకొన్ని నిర్ణయాలు దుమారాన్ని కల్గించాయి. ఈ తరుణంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన వారం రోజులకే ఆయన తన ప్రతిష్టను కొల్పోయారు.

ఈ నిర్ణయాలు తీసుకొన్న తర్వాత అమెరికాలో కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు వద్దంటూ సగానికి పైగా ప్రజలు కోరుకొంటున్నట్టుగా వార్తలు వచ్చాయి.

English summary
Donald Trump has branded his critics in the US press "not my enemy" but the “enemy of the American people”, in a tweet that came a day after he launched a sustained attack on the media during a White House press conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X