వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలేరియా మందులతో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. కానీ: డొనాల్డ్ ట్రంప్ కొత్త చిట్కా..!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోన్న కరోనా వైరస్‌ను నివారించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ కొత్త చిట్కాను వెల్లడించారు. మూడునెలలు దాటుతున్నప్పటికీ.. భయానక కరోనా వైరస్‌ను తరిమి కొట్టడానికి అవసరమైన మందులను ఏవీ పరిశోధకులు కని పెట్టలేకపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న మందులతోనే దాన్ని చెక్ పెట్టొచ్చని ట్రంప్ వెల్లడించారు. మలేరియాను నివారించడానికి వినియోగించే హైడ్రోక్సిక్లోరొక్విన్‌తో కరోనాను తరిమికొట్టొచ్చని చెప్పారు.

ఏమైనా.. కేసీఆర్ డిఫరెంట్: జనానికే కాదు.. ఇళ్లకూ క్వారంటైన్ సింబల్: కేటీఆర్ నియోజకవర్గంలో కలకలం..!ఏమైనా.. కేసీఆర్ డిఫరెంట్: జనానికే కాదు.. ఇళ్లకూ క్వారంటైన్ సింబల్: కేటీఆర్ నియోజకవర్గంలో కలకలం..!

కరోనా వైరస్ సోకిన వారికి అందజేస్తోన్న వైద్య చికిత్సల్లో భాగంగా.. హైడ్రోక్సిక్లోరొక్విన్‌ను వినియోగించవచ్చని, ఇది ప్రభావం చూపుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హైడ్రొక్సిక్లోరొక్విన్ విస్తృతంగా లభిస్తోందని, ప్రతి దేశంలోనూ ఇది అందుబాటులో ఉందని చెప్పారు. ఈ మెడిసిన్.. అత్యంత శక్తిమంతమైనదిగా పరిశోధకులు వెల్లడిస్తున్నారని ట్రంప్ అన్నారు. దీన్ని శాస్త్రీయబద్ధంగా ఇంకా నిర్ధారించాల్సి ఉందని తెలిపారు. తొలుత- హైడ్రొక్సిక్లోరొక్విన్ వినియోగంపై అమెరికాకే చెందిన ప్రముఖ ఇమ్యునాలజిస్ట్ ఆంథొని స్టీఫెన్ ఫ్యూసీ ఇదివరకే దీనిపై ఓ ప్రకటన చేశారు.

Donald Trump says hydroxychloroquine could be answer to COVID 19

అనంతరం ఆయన ఈ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. ఈ మందులను వినియోగించి కరోనా వైరస్ వ్యాప్తి చెందటాన్ని నివారించవచ్చనడంపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు, పరిశోధన ఫలితాలు లేవని చెప్పుకొచ్చారు. ఈ దిశగా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారని, పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. అదే సమయంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్లినికల్ ట్రయల్స్‌లో ఏ విషయం తేలనిదే హైడ్రొక్సిక్లోరొక్విన్ వినియోగంపై ఓ అవగాహనకు రాలేమని చెప్పారు.

Recommended Video

Trump India Visit Lands Him In Trouble For Upcoming US Elections?

మన శరీరంలోకి ప్రవేశించిన తరువాత.. కరోనా వైరస్ క్రమంగా రక్త కణాలను బలహీన పరుస్తుందని, ఆ ప్రక్రియ ఆరంభం కావడానికి ముందే.. దాన్ని నిర్జీవం చేయడానికి అవసరమైన క్లినికల్ ట్రయల్స్‌ను ప్రస్తుతం తాము కొనసాగిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ను అరికట్టడానికి అవసరమైన మందులను తయారు చేయడానికి కనీసం 18 నెలల సమయం పట్టొచ్చంటూ ఫ్యూసీ ఇదివరకే ఓ సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో.. దానికి కౌంటర్ ఇచ్చేలా ట్రంప్ హైడ్రొక్సిక్లోరొక్విన్‌ పేరును ప్రస్తావించారు. ఈ మందును సత్వరమే వినియోగించి, ఫలితాలను పరిశీలించాలని చెప్పుకొచ్చారు.

English summary
America President Donald Trump says to clinging to his feeling that a malaria drug widely available could be the answer-in-waiting to an outbreak spreading around the nation, shutting down major parts of the economy, and posing the biggest challenge he has faced as president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X