• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రంప్‌తో కంపెనీలు ఢీ: విదేశాల్లో ఉత్పత్తికి ప్లాన్

By Swetha Basvababu
|

వాషింగ్టన్: వివక్షా పూరితమైన నిర్ణయాలతో ప్రపంచ దేశాలు, పారిశ్రామిక సంస్థలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్యానికి తెర దించేందుకు పలు పారిశ్రామిక సంస్థలు సిద్ధమయ్యాయి. విదేశీయులకు ఉపాధి కల్పన, అమెరికాలోకి ప్రవేశంపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న ట్రంప్‌కు అదే రీతిలో జవాబు చెప్పేందుకు అమెరికా కంపెనీలు రెడీ అయ్యాయి. ఆయా సంస్థలు విదేశాలకు తమ పారిశ్రామిక ఉత్పాదకత కార్యకలాపాలు బదిలీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉపాధి కల్పనకు గల అవకాశాలపై ట్రంప్ న్యాయశాఖ అధికారుల సలహా తీసుకోనున్నారు. కనీసం ఐదు కంపెనీలు తమ ఉత్పత్తిని విదేశాలకు మళ్లించనున్నాయని తెలుస్తోంది.

విదేశాలకు ఐదు సంస్థల ఉత్పాదక కార్యకలాపాలు

కాటర్ పిల్లర్ ఇంక్, యునైటెడ్ టెక్నాలజీస్ కార్పొరేషన్, డానా ఇంక్, 3ఎం కో అండ్ జనరల్ ఎలక్ట్రిక్ కో సంస్థలు తమ పొరుగున ఉన్న మెక్సికోతోపాటు చైనా, భారత్ తదితర దేశాల్లో ఉత్పత్తులు ప్రారంభించేందుకు సిద్దం చేసుకుంటున్నాయని అమెరికా కార్మికశాఖ రికార్డులను బట్టి తెలియవస్తున్నది. ఈ ఐదు కంపెనీలలకు చెందిన 17 మంది ప్రతినిధుల గ్రూపు కూడా డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్నారు. డొనాల్డ్ ట్రంప్.. తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు సహకరించాలని ఆయా ప్రతినిధులను కోరనున్నారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ కంపెనీల ప్రతినిధులు ట్రంప్ తో సమావేశమవుతారా? లేదా? అన్న విషయం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. వారు తమ సమస్యలు చెప్పడానికే ట్రంప్ అపాయింట్ మెంట్ కోరారని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు.

Donald Trump to seek advice today from companies offshoring work to India, others

ఆఫ్‌సోర్ టాక్స్ విధిస్తానని ట్రంప్ బెదిరింపులు

ఒకవేళ అమెరికా కంపెనీలు ఉత్పత్తుల కోసం విదేశాలకు వెళితే 'విదేశీయులకు ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థలపై' పన్ను విధిస్తానని ట్రంప్ బెదిరింపులకు దిగారు. పలు కంపెనీలు విదేశాల్లో చౌకగా ఉత్పత్తులు చేసి అమెరికాకు తీసుకొస్తాయని ఆయన ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పారు. కానీ పారిశ్రామిక లావాదేవీలు, ఇతర అంశాలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ వాస్తవ పరిస్థితులను ఆయనకు విశదపరిచినట్లు తెలియవస్తున్నది. తద్వారా మొదటి నుంచి తాను అనుసరిస్తూ వచ్చిన వైఖరికే కట్టుబడి ఉంటారా? తన వైఖరి మార్చుకుంటారా? అన్న సంగతి తెలియరాలేదు.

60 లక్షల ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా

2000 నుంచి 2010 వరకు అమెరికా 60 లక్షల మంది ఉత్పాదక సామర్థ్యం గల ఉద్యోగాలను కోల్పోయింది. ఇందులో తొమ్మిది లక్షల మందికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. పలు బహుళ జాతి సంస్థలు తమ ఉత్పాదక ఖర్చు తగ్గించుకునేందుకే విదేశాల్లో ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలుస్తున్నది. ప్రత్యేకించి జనరల్ ఎలక్ట్రికల్స్ తన ఉత్పాదక లావాదేవీలను ఫ్రాన్స్, బ్రిటన్, హంగేరీలకు మళ్లించాలని తలపోస్తున్నది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Donald Trump, who has vowed to stop US manufacturing from disappearing overseas, will seek job-creation advice on Thursday from at least five companies that are laying off thousands of workers as they shift production abroad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more