వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారంలో ఉగ్రవాదుల అంతం..! ఐఎస్ ఖేల్ ఖతం..! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : ఉగ్రవాదులను అంతమొందించే తమ ఆశయం నెరవేరబోతుందని వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సిరియాలో కల్లోలం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ను అంతం చేసేలా.. మరో వారంలో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. వాషింగ్టన్ లో బుధవారం నాడు జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడిన ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

70 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ఉగ్రవాదం అంశంపై ట్రంప్ ప్రసంగించారు. ఐఎస్ ఉనికి కనిపించకుండా సమూలంగా రూపుమాపేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నామని.. వారంలోగా అధికారిక ప్రకటన చేస్తానని తెలిపారు. ఐఎస్ ఆధీనంలోని సిరియా, ఇరాక్ లోని చాలా ప్రాంతాలు విముక్తి పొందడానికి చాలామంది సాయం అందించినట్లు ప్రస్తావించారు ట్రంప్. అమెరికాతో పాటు మిత్రదేశాలు, సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ కృషి ఫలితంగానే అది సాధ్యమైనట్లు చెప్పుకొచ్చారు. ఆర్థికంగా అండదండలు అందించడమే గాకుండా సైనిక సహకారం ఇవ్వడం మరచిపోలేదని గుర్తుచేశారు.

donald trump sentences on islamic state

పోయినేడాది డిసెంబర్ లో సిరియా నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను పూర్తిగా ఓడించిన కారణంగా సైనిక దళాలను వెనక్కి రప్పించారు.

English summary
US President Donald Trump said that their ambition to end terrorists was going to be fulfilled. The plan is to prepare for another week to end the Islamic State, which will create a stir in Syria. Trump, speaking at an international summit in Washington, made this statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X