• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిగ్ షాక్ : అధ్యక్ష ఎన్నికల వేళ హెచ్-1బీ వీసాలపై కత్తి... కొత్త రూల్స్‌తో మనోళ్లకు కష్టమే...

|

గత అధ్యక్ష ఎన్నికల్లో స్థానిక సెంటిమెంటును రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన ట్రంప్... ఈసారి కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ముంగిట్లో స్థానికతకు పెద్ద పీట వేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో విదేశీ ఉద్యోగులకు జారీ చేసే హెచ్1-బీ వీసాలకు పరిమితులు విధిస్తూ మంగళవారం(అక్టోబర్ 5) ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో చాలామంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోవడంతో విదేశీ ఉద్యోగుల స్థానంలో వీరికి అవకాశాలు కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

'డబుల్ థంబ్స్ అప్‌' చూపించారు సరే... పూర్తిగా కోలుకున్నట్లేనా.. ట్రంప్ డిశ్చార్జిపై ప్రశ్నలు...

కొత్త నిబంధనలతో ఏం జరుగుతుంది...

కొత్త నిబంధనలతో ఏం జరుగుతుంది...

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ&డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం... హెచ్1-బీ వీసాతో పనిచేసే ఉద్యోగికి కంపెనీలు అధిక వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న నిబంధనలు కంపెనీలకు అనువుగా ఉండటంతో... విదేశాల నుంచి తక్కువ వేతనానికి పనిచేసే ఉద్యోగులను తెచ్చి పెట్టుకుంటున్నాయి. కొత్త నిబంధనలతో ఆ వేతనాలను భారీగా పెంచాల్సి ఉంటుంది కాబట్టి కంపెనీలు విదేశీ ఉద్యోగుల కంటే అమెరికన్లకే ఉద్యోగాలిచ్చేందుకు మొగ్గుచూపే అవకాశం ఉంటుంది.

కాలేజీ డిగ్రీ తప్పనిసరి...

కాలేజీ డిగ్రీ తప్పనిసరి...

తాజా ఉత్తర్వుల్లో హెచ్-1బీ 'స్పెషల్ ఆక్యుపేషన్'ను పునర్నిర్వచించారు. దాని ప్రకారం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారుల అర్హతను నిర్ణయించే డిగ్రీలపై స్పష్టమైన సూచనలు చేశారు. ఇదివరకు కాలేజీ డిగ్రీ లేదా అందుకు సరిసమానమైన అనుభవం ఉన్నవారికి హెచ్-1బీ వీసాలకు అనుమతించేవారు. కానీ ఇకపై సంబంధిత ఫీల్డ్‌లో కాలేజీ డిగ్రీ తప్పనిసరి. ఉదాహరణకు ఎవరైనా సాఫ్ట్‌వేర్ డెవలపర్ హెచ్-1బీ వీసా పొందాలంటే కేవలం పని అనుభవం ఉంటే సరిపోదు. దానికి సంబంధించిన కాలేజీ డిగ్రీ కూడా ఉండి తీరాలి.

ఈ రంగాలపై ప్రభావం...

ఈ రంగాలపై ప్రభావం...

తాజా నిబంధనలతో టెక్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్,బయోఇన్ఫర్మేటిక్స్ రంగాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఆ రంగాల్లో నిపుణులైనవారికి వేరే సబ్జెక్టుల్లో డిగ్రీ ఉండవచ్చునని... కొత్త నిబంధనలతో ఆయా రంగాల సేవలకు నిపుణుల కొరత ఏర్పడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలేజీ డిగ్రీ నిబంధనల నుంచి కేవలం ఫ్యాషన్ మోడల్స్‌కు మాత్రం మినహాయింపునివ్వడం గమనార్హం.

మనోళ్లకు కష్టమే...

మనోళ్లకు కష్టమే...

అమెరికా ప్రతీ ఏటా దాదాపు 85వేల హెచ్-1బీ వీసాలను జారీ చేస్తోంది. కొత్త నిబంధనలతో హెచ్-1బీ దరఖాస్తుల్లో మూడో వంతు దరఖాస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారతీయ ఐటీ నిపుణులు,ఐటీ సంస్థలను ఈ నిబంధనలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కూడా హెచ్-1బీ ఉద్యోగుల వేతన పెంపును సమర్థించారు. ఈ నిర్ణయంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడినపడుతుందని,అమెరికన్లకు ఉద్యోగాలు వస్తాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.

English summary
The Trump administration announced an overhaul of the H-1B visa program for high-skilled foreign workers that will require employers to pay H-1B workers significantly higher wages, narrow the types of degrees that could qualify an applicant and shorten the length of visas for certain contract workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X