వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందమైనది.. దాచుకుంటా: ట్రంప్ ఉద్వేగం, నోరు పారేసుకున్నాడు

అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా తనకు ఓ అందమైన లేఖను ఉంచిపోయారని అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒబామా పేరు చెప్పి ఆయన కొన్ని క్షణాల పాటు ఉద్వేగానికి లోనయ్యారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా తనకు ఓ అందమైన లేఖను ఉంచిపోయారని అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒబామా పేరు చెప్పి ఆయన కొన్ని క్షణాల పాటు ఉద్వేగానికి లోనయ్యారు.

గతంలో ఒబామాను పనికిమాలిన అధ్యక్షులు అన్న ట్రంప్.. ఇప్పుడు కీర్తించారు. తనకు ఓ అందమైన లేఖను రాశారని చెప్పి, దానిని చూపించారు. ఈ లేఖను చాలా భద్రంగా దాచి పెడతానని చెప్పారు. అందులోని అంశాలను తన మనసులో ఉంచుకొని గౌరవిస్తానన్నారు.

ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రముఖులకు ఓ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వైట్ హౌస్‌లో ఒబామా అందమైన లేఖను ఉంచి వెళ్లారని, చాలా చాలా బాగుందని, దానిని భద్రంగా ఉంచుతానని చెప్పారు. ఆ లేఖలో ఏముందో మీడియాకు చెప్పనని అన్నారు.

ట్రంప్ ముఖాకృతిలో దూకుడు..

ట్రంప్ ముఖాకృతిలో దూకుడు..

ట్రంప్‌ ముఖ ఆకృతి.. దూకుడు, అనైతిక ప్రవర్తన వంటి లక్షణాలను సూచిస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి ఆయన ముఖ నిర్మాణమూ దోహదపడిందని అభిప్రాయపడింది. నాయకత్వ బాధ్యతల నిర్వహణలో వ్యక్తుల విజయాలను ప్రభావితం చేసే అంశాలపై బ్రిటన్‌ పరిశోధకులు తాజా అధ్యయనం నిర్వహించారు.

ఐసిస్‌ను ఖతం చేస్తాం2

ఐసిస్‌ను ఖతం చేస్తాం2

ఇస్లామిక్ స్టేట్ పనిపట్టే కాలం ఆసన్నమైందని ట్రంప్‌వ్యాఖ్యానించారు. వీటిని నిర్వీర్యం చేస్తామని చెప్పారు. సీఐఏ ప్రతినిధులతో శనివారం ఆయన తొలిసారిగా మాట్లాడారు. వర్జీనియాలోని సీఐఏ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

మీడియాపై ఆగ్రహం

మీడియాపై ఆగ్రహం

ట్రంప్‌ మరోసారి మీడియాపై నోరు పారేసుకున్నారు. భూప్రపంచంలో ఏమాత్రం నిజాయతీలేని వారు పాత్రికేయులేనని ఆరోపించారు. అందుకే ప్రసార మాధ్యమాలపై యుద్ధం చేస్తున్నానన్నారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి తగినంత మంది ప్రజలు హాజరుకాలేదని కొన్ని ప్రసార మాధ్యమాలు విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన విరుచుకుపడ్డారు.

లక్షలాది మంది వచ్చారు

లక్షలాది మంది వచ్చారు

ప్రమాణ స్వీకారోత్సవానికి ఇంచుమించు పది పదిహేను లక్షల మంది ప్రజలు వచ్చి ఉంటారని తన అంచనా అని, ఆ పత్రికలో మాత్రం జనమెవరూ లేని ఖాళీ స్థలాన్ని చూపించారని, మహా అయితే రెండున్నర లక్షల మంది వచ్చి ఉంటారనీ, తాను జనాన్ని ఆకర్షించలేకపోయానని రాశారని, అలా రాసినవారు దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని మండిపడ్డారు.

అల్లుడి నియామకంపై..

అల్లుడి నియామకంపై..

అల్లుడిని నియమించుకునే అధికారం ట్రంప్‌నకు ఉందని, అది చట్టవ్యతిరేకమేమీ కాదని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. సదరు నియామక అధికారం ట్రంప్‌నకు ఉందని స్పష్టం చేసింది.

English summary
Donald Trump shows off 'beautiful' letter Barack Obama left him in Oval Office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X