వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా షట్‌డౌన్‌కు తాత్కాలికంగా బ్రేక్ వేసిన ట్రంప్: అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారి

|
Google Oneindia TeluguNews

అమెరికాలో 36 రోజులపాటు కొనసాగిన ప్రభుత్వ పాక్షిక షట్‌డౌన్‌కు తెరపడింది. ఇలా అమెరికా ప్రభుత్వం ఇన్ని రోజుల పాటు షట్‌డౌన్ విధించడం అమెరికా చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. మెక్సికన్ గోడ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలన్న ట్రంప్ నిర్ణయంతో వివాదం మొదలైంది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విబేధించడంతో ట్రంప్ వెనక్కు తగ్గారు. మెక్సికన్ గోడ నిర్మాణం ఆలోచనను ప్రస్తుతానికి పక్కన బెట్టారు.

ట్రంప్ ప్రభుత్వం పాక్షికంగా షట్‌డౌన్ విధించడంతో పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదువారాలుగా వేతనం అందలేదు. దీంతో పలు శాఖలు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతానికి షట్‌డౌన్ తొలగిస్తున్నట్లు ప్రకటిస్తూ దానికి సంబంధించిన ఫైలుపై ట్రంప్ సంతకం చేయడంతో ఈ వివాదానికి తెరపడింది. ఇకపై అమెరికా ప్రభుత్వం యథావిధిగా తన కార్యకలాపాలు కొనసాగించనుంది. ట్రంప్ ఇప్పటికైనా ఓ పాఠం నేర్చుకున్నారని అన్నారు డెమొక్రాటిక్ సెనేటర్ చక్ షూమర్. షట్‌డౌన్‌‌ను ఎత్తివేస్తున్నామనే ప్రతిపాదనకు సెనేట్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలపడంతో ట్రంప్ సంతకం చేశారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి.

Donald Trump signs deal ending longest US government shutdown

ప్రభుత్వం షట్‌డౌన్ తొలగింపు తాత్కాలికం మాత్రమే అని చెప్పిన ట్రంప్ ఒకవేళ కాంగ్రెస్ నుంచి సరైన స్పందన రాకపోతే తిరిగి ఫిబ్రవరి 15న ప్రభుత్వం షట్‌డౌన్ అవుతుందని స్పష్టం చేశారు. ఇందుకోసం చట్టంలోని అధికారాలను ఉపయోగిస్తానని ట్రంప్ హెచ్చరించారు. మెక్సికన్ గోడ నిర్మించడం తప్ప వేరే ఆప్షన్ లేదని ట్రంప్ పునరుద్ఘాటించారు.

English summary
Donald Trump signs deal ending longest US government shutdown
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X