వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిల్లరీ హత్య చేసినా తప్పించుకుంటారు: ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి అయిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై తీవ్రస్థాయిలో విమర్శించారు. హిల్లరీ క్లింటన్ 20 వేలకు పైగా ప్రజలు చూస్తుండగానే ఓ వ్యక్తిని కాల్చి చంపి కేసు నుంచి తప్పించుకుంటారని ఆరోపించారు.

పబ్లిక్ గా ఓ వ్యక్తిని కాల్చి హత్య చేసి విచారణ లేకుండా తప్పించుకునే చాకచక్యం హిల్లరీ క్లింటన్ కు ఉందని ఎద్దేవ చేశారు. విచారణ లేకుండా కేసు నుంచి తప్పించుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డోనాల్డ్ ట్రంప్ ప్రసగించారు. రానురాను ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. తప్పు చేసినా శిక్ష పడకుండా హిల్లరీ క్లింటన్ తప్పించుకుంటారని అన్నారు.

Donald Trump slams Hillary Clinton over Emails

గతంలో విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్ పని చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రయివేట్ ఈ మెయిల్స్ ఉపయోగించి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అంతే కాకుండ దేశ సమాచారన్ని వ్యక్తిగతంగా వాడుకున్నారని విమర్శించారు.

హిల్లరీ క్లింటన్ మీద ఎఫ్ బీఐ విచారణ చేపట్టినా ఆమెను కేసు నుంచి ఎందుకు తప్పించారు అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకురాలిగా హిల్లరీ క్లింటన్ చరిత్రలో నిలిచిపోతారని డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.

English summary
Hillary Clinton’s e-mail server was always going to be a problem for her. But it was unlikely to be enough, by itself, to torpedo her campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X