వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్న పాములు వదలండి.. నేడు కాళ్లలోకి కాల్చండి.. ట్రంప్ మరో తుగ్లక్ నిర్ణయం!

|
Google Oneindia TeluguNews

పాలకులు తీసుకునే తుగ్లక్ నిర్ణయాలు ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తాయోననే విషయం పలు సందర్భాల్లో ప్రజలకు స్పష్టమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మితి మీరిన నిర్ణయాలతో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ జాబితాలోకి చేరిపోతున్నాడా అనే అనుమానం మరింత బలపడుతున్నది. ఈ మధ్య కాలంలో అమెరికాలో వలసవాదులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొనే నిర్ణయాలు అక్కడి అధికారులను, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు స్థానికంగా దుమారం లేపుతున్నాయి. ఇంతకు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

ప్రపంచం వినింది..కానీ జైశంకర్ వినలేదు: ట్రంప్ గురించి మోడీ ఆ స్లోగన్ ఇవ్వలేదా ?ప్రపంచం వినింది..కానీ జైశంకర్ వినలేదు: ట్రంప్ గురించి మోడీ ఆ స్లోగన్ ఇవ్వలేదా ?

వలసవాదులపై తుగ్లక్ నిర్ణయాలు

వలసవాదులపై తుగ్లక్ నిర్ణయాలు

వలసవాదులను అరికట్టాలంటే మెక్సికోతో ఉన్న 2 వేల కిలోమీటర్ల సరిహద్దు వెంబడి గోడ కట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అధికారులకు ముచ్చెటమటలు పట్టించడమే కాకుండా ఆశ్చర్యానికి గురిచేశాయి. గోడ కట్టడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు. సరిహద్దు ఇరువైపుల నుంచి వచ్చే విద్యార్థులకు సమస్యలు సృష్టిస్తాయని, పర్యాటకులు ముఖం చాటేయ్యడానికి అవకాశం ఉంది. దాంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

మెక్సికో సరిహద్దులో

మెక్సికో సరిహద్దులో

అధికారులు సూచనతో సందిగ్ధంలో పడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మెక్సికో సరిహద్దు వెంట ఉండే కాలువల్లో నీళ్లు నింపాలని, సరిహద్దు వెంట పాములు, మొసళ్లు వదలాలని సూచించడంతోపాటు గోడకు విద్యుత్ తీగలు పెట్టాలని, ఇలా రకరకాలకు సలహాలు ఇవ్వడంతో అధికారులకు దిమ్మతిరిగినంత పనైంది.

 దాడి చేస్తే కాళ్లలోకి కాల్చండి

దాడి చేస్తే కాళ్లలోకి కాల్చండి

ఇక తాజాగా ట్రంప్ మరో ముందుడుగు వేసి వలసవాదులు దేశంలోకి చొరబాడేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించాడు. చొరబాటు దారులు, వలసవాదులు దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకొంటే వలసవాదులు రాళ్ల దాడి చేసే ప్రమాద ఉందని అధికారులు సూచించగా.. దానిపై స్పందిస్తూ వారి కాళ్లపైకి సైనికులు తుపాకి గురిపెట్టి కాల్చాలని ట్రంప్ చెప్పడంతో అధికారులు నివ్వెరపోయారు.

ట్రంప్‌ ఆతృతపై అధికారులు

ట్రంప్‌ ఆతృతపై అధికారులు

ఇలా ట్రంప్ వ్యాఖ్యలపై అధికారులు తలోరకంగా సూచిస్తున్నారు. వలసవాదులకు చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు ట్రంప్ చాలా ఆతృతతో ఉన్నారు. అందుకే విపరీతమైన నిర్ణయాలు తీసుకొనే పనిలో పడ్డారు. ఇలాంటి తీవ్ర నిర్ణయాలు ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది అని థామస్ డీ హోమన్ అనే అధికారి వ్యాఖ్యానించారు.

English summary
American President Donald Trump is moving very serious about migrants. He was ordered to shoot Migrant if they try to enter into US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X