వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా భయం,రోజూ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్, సైడ్ ఎఫెక్ట్స్ అంటోన్న నిపుణులు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పేరు వింటే యావత్ ప్రపంచం గజ గజ వణికిపోతోంది. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ కూడా భయపడిపోతున్నారు. తన సిబ్బందికి కూడా వైరస్ సోకడంతో.. ప్రతీ రోజు పరీక్ష చేయించుకున్నారు. ఇంతవరకు ఓకే కానీ వైరస్ నివారణ అని భావిస్తోన్నహైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వేసుకుంటున్నారు. ప్రతీరోజు జింక్‌తో కలిపి టాబ్లెట్ వేసుకుంటున్నానని ట్రంప్ మీడియా ప్రతినిధులకు వివరించారు.

 బరాక్ ఒబామా ఒక అసమర్థుడు, ఇక అంతే: అక్కసు వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్ బరాక్ ఒబామా ఒక అసమర్థుడు, ఇక అంతే: అక్కసు వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్

హైడ్రాక్సీ క్లోరిక్విన్ మలేరియా కోసం వాడుతుంటారు. ఈ టాబ్లెట్ కరోనా వైరస్ కోసం పనిచేస్తుందని అమెరికా వైద్యులు కూడా చెప్పలేదు. కరోనా నుంచి రక్షిస్తోందని చెప్పకపోయినా... వైట్ హౌస్ వైద్యులను అడిగి మరీ ట్రంప్ టాబ్లెట్ వేసుకుంటున్నారు. గత 10 రోజుల నుంచి మాత్ర వేసుకుంటున్నానని ట్రంప్ వివరించారు. మాత్ర వేసుకోవడం మంచి జరుగుతోందని భావించానని.. దీనిపై తాను చాలా కథనాల చదివానని తెలిపారు.

Donald Trump taking hydroxychloroquine to protect corona virus

కరోనా కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వేసుకోవద్దని.. అలా వాడితే దుష్ప్రభావాలు చూపిస్తాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని.. గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని, అర్థరైటిస్ కూడా వస్తోందని... కొన్ని సార్లు మరణం కూడా సంభవించొచ్చని హెచ్చరిస్తున్నారు. నిపుణుల వాదనను ట్రంప్ తోసిపుచ్చారు. వారి వాదన కంటే.. తాను నమ్మిందే నిజమని చెబుతున్నారు. మరోవైపు మే మొదటి వారంలో ఇద్దరు వైట్ హౌస్ సిబ్బందికి కూడా వైరస్ వచ్చింది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, సిబ్బందిని సెల్ప్ ఐసోలేషన్‌కు పంపించారు.

English summary
Donald Trump told reporters he has been taking the drug, hydroxychloroquine, and a zinc supplement daily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X