వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా : మోదీకి థ్యాంక్స్ చెప్పిన ట్రంప్.. ఈ సాయం మరవలేమంటూ..

|
Google Oneindia TeluguNews

అమెరికాకు హైడ్రాక్సి క్లోరోక్విన్‌(HCQ)ను ఎగుమతి చేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీతో పాటు భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోమని.. ఇలాంటి సందర్భాల్లోనే ఇరువురి మధ్య మరింత సహాయ సహాకారాలు అవసరమవుతాయని పేర్కొన్నారు. నిజానికి హైడ్రాక్సి క్లోరోక్విన్ ఎగుమతులపై భారత్ నిషేధం విధించినప్పటికీ.. ట్రంప్ హెచ్చరికలతో వెనక్కి తగ్గక తప్పలేదు. పాక్షికంగా నిషేధాన్ని ఎత్తివేసి అమెరికాతో పాటు మరికొన్ని దేశాలకు హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తోంది.

కరోనా వైరస్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేని కారణంగా అమెరికా లాంటి దేశాల్లో హైడ్రాక్సి క్లోరోక్విన్‌కు మరికొన్ని మందులు జోడించి ప్రయోగాలు చేస్తున్నారు. మలేరియా చికిత్సలో ఉపయోగించే ఈ మందు కరోనాపై చికిత్సలోనూ కొంతమేర ఫలితాలను ఇస్తున్నట్టు చెబుతున్నారు. హైడ్రాక్సి నిల్వలు భారత్‌లో భారీగా ఉండటంతో తమ దేశానికి ఎగుమతి చేయాల్సిందిగా ప్రధాని మోదీని కోరారు. అయితే కరోనా నేపథ్యంలో భారత్ హైడ్రాక్సి క్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో ట్రంప్ విజ్ఞప్తికి మొదట సానుకూలంగా స్పందించలేదు. దీంతో స్వరం మార్చిన ట్రంప్ హైడ్రాక్సి క్లోరోక్విన్ ఎగుమతి చేయకపోతే ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. వెనక్కి తగ్గక తప్పని పరిస్థితుల్లో భారత్ పాక్షికంగా ఎగుమతులపై నిషేధాన్ని సడలించి అమెరికాకు ఔషధాలను ఎగుమతి చేసింది.

Donald Trump thanks India and PM Modi for supplying hydroxychloroquine to USA

ప్రపంచ ఉత్పత్తిలో నాలుగు వంతుల్లో ఒక వంతు భారత్ నుంచి జెనరిక్ డ్రగ్స్ ఉత్పత్తి అవుతున్నాయి. దేశీయ అవసరాల కోసం భారత్ హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను నిల్వ చేసుకున్నప్పటికీ ట్రంప్ హెచ్చరికలతో ఎగుమతి చేయక తప్పలేదు. సాధారణంగా మలేరియా రోగులకు అందించే చికిత్సలో భాగంగా హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను ఉపయోగిస్తారు. అయితే కరోనాకు కూడా ఇది విరుగుడుగా పనిచేస్తుందని కొన్ని కథనాలు రావడంతో కొంతమంది సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అమెరికాలోని అరిజోనాలో ఓ వ్యక్తి డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను తీసుకోవడంతో మృతి చెందాడు. కాబట్టి ఈ మందు అందరికీ పనిచేయదన్న విషయం గుర్తెరగాలని వైద్య నిపుణలు చెబుతున్నారు. కరోనా పేషెంట్లను ట్రీట్ చేస్తున్న వైద్యులకు,పేషెంట్లతో సన్నిహితంగా మెలిగి వైరస్ బారినపడినవారికే ఈ మందును ఇవ్వాలని ఐసీఎంఆర్ సైతం సూచించింది.

Recommended Video

AP Lockdown :15 New కరోనా Cases In AP,Total Cases 329

English summary
US President Donald Trump on Wednesday thanked India and Prime Minister Narendra Modi for allowing the export of hydroxychloroquine (HCQ) - an anti-malarial drug being experimentally used in many countries for treating Covid-19 - to the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X