వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రక్షణ కోల్పోనున్న ట్రంప్ -నిషేధం తప్పదు -ఇప్పటికే హోరాహోరీ యుద్ధం

|
Google Oneindia TeluguNews

ఒక్కసారి పవర్ కోల్పోతే తమ పరిస్థితి ఎలా తయారవుతుందో పొలిటీషియన్లకు బాగా తెలుసు కాబట్టే పీఠం నుంచి దిగిపోడానికి విలవిల్లాడిపోతారు. ఈ విషయంలో ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాలుగడుగులు ముందే ఉన్నారు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ మెజార్టీ సాధించినా, అమెరికా 46 అధ్యక్షుడు బైడెనే అని ఎన్నికల అధికారులు, ఏజెన్సీలు, మీడియా సంస్థలు ప్రకటించినా.. తాను మాత్రం అంగీకరించబోనని ట్రంప్ మొండికేశారు. దీంతో..

షాకింగ్:7 కోట్ల ఓట్లతో ట్రంప్ గెలుపు! -తుపాకులు, స్ప్రే,బ్యాట్లతో దాడులు-అమెరికాలో తీవ్రమైన అల్లర్లుషాకింగ్:7 కోట్ల ఓట్లతో ట్రంప్ గెలుపు! -తుపాకులు, స్ప్రే,బ్యాట్లతో దాడులు-అమెరికాలో తీవ్రమైన అల్లర్లు

రక్షణ కోల్పోనున్న ట్రంప్..

రక్షణ కోల్పోనున్న ట్రంప్..

ఎన్నికల ఫలితాలు మోసమంటూ ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తోన్న వరుస ప్రకనటలు అమెరికాలో అనిశ్చితి, అశాంతిని రేపుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ట్రంప్ మద్దతుదారులు రోడ్లపైకొచ్చి ఎన్నికల ఫలితాలను విశ్వసించబోమని, విజేత ట్రంపే అని నినాదలు చేస్తూ విధ్వంసానికి పూనుకున్నారు. గెలుపు వేడుకలు చేసుకుంటోన్న బైడెన్ సపోర్టర్లపై పెప్పర్ స్రే, బేస్ బాల్ బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు. శనివారం రాత్రి కూడా సంచలన ట్వీట్లు చేసిన ట్రంప్.. 7 కోట్ల లీగల్ ఓట్లతో తానే గెలిచానని చెప్పుకున్నారు. ఈ క్రమంలో ట్విటర్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆయన ప్రజాప్రయోజనాల రక్షణ కోల్పోబోతున్నట్లు ట్విటర్ తెలిపింది.

నిషేధం తప్పేలా లేదు..

నిషేధం తప్పేలా లేదు..

మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ మ్యాజిక్ ఫిగర్270కాగా, డెమోక్రాట్ జోబైడెన్ ఇప్పటికే 290 ఓట్లు సాధించి, విజేతగా నిలిచారు. అయితే, 11 రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. ఎన్నికలు, ఫలితాలపై గడిచిన వారం రోజులుగా ట్రంప్ చేస్తోన్న ట్వీట్లు, ప్రెస్ మీట్లు వివాదాస్పదం అయ్యాయి. వైట్ హౌజ్ నుంచి ఆయన మాట్లాడుతుండగానే దాదాపు అన్ని ఛానెళ్లు లైవ్ ప్రసారాలను నిలిపేసి, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రేక్షకులకు వివరణ ఇచ్చాయి.

ట్విటర్ సైతం ట్రంప్ చేస్తోన్న వివాదాస్పద ట్వీట్ల కింద బ్లూ మార్క్ పెడుతూ.. ‘ఇది తప్పుడు సమాచారం. సరైన వివరణ కోసం ఇక్కడ చూడండి'అని వివరణ ఇస్తూ వస్తోంది. అంతకుముందు కరోనా వైరస్ పై ట్వీట్ల విషయంలోనూ ట్విటర్ ఇలాగే స్పందించింది. ట్రంప్ తీరు ఎంతకీ మారకపోవడంతో త్వరలోనే ఆయన అకౌంట్ ను నిషేధించే దిశగా ట్విటర్ సంస్థ అడుగులు వేసింది. అందుకు ముహుర్తాన్ని కూడా వెల్లడించింది..

కమలగెలుపుపై చంద్రబాబు ఆసక్తికరం -అమెరికా 49వ వైస్ ప్రెసిడెంట్ -శాంతి కోరిన వైసీపీ నేత పీవీపీకమలగెలుపుపై చంద్రబాబు ఆసక్తికరం -అమెరికా 49వ వైస్ ప్రెసిడెంట్ -శాంతి కోరిన వైసీపీ నేత పీవీపీ

జనవరి 20 తర్వాత జరిగేదిదే..

జనవరి 20 తర్వాత జరిగేదిదే..

అమెరికా ఎన్నికలు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, చికిత్స విధానాలపై కుప్పలుతెప్పలుగా తప్పుడు సమాచారాన్ని, ఉద్దేశపూర్వక వివాదాలను ట్రంప్ ట్వీట్ల రూపంలో జనంలోకి వదిలారు. ఇప్పటికే దీనిపై ట్రంప్, ట్విటర్ సంస్థ మధ్య హోరాహోరీ యుద్ధం సాగుతున్నది. ప్రస్తుత ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్.. జనవరి 20న బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఆ మరుక్షణం నుంచే ఆయన సాధారణ పౌరుడైపోతారు. దీంతో దేశాధినేతలకు ట్విటర్ కల్పించే అదనపు రక్షణను కోల్పోతారు. తద్వారా తప్పుడు సమాచారం ఇచ్చి, హింసకు ప్రేరేపించిన కారణంగా ఆయన అకౌంట్ పై నిషేధం విధించనున్నారు. దీనిపై..

ఇన్నాళ్లూ ఓపిక పట్టింది అందుకే..

ఇన్నాళ్లూ ఓపిక పట్టింది అందుకే..

‘‘సాధారణంగా నిబంధనలు అతిక్రమించే ట్విటర్ యూజర్లపై మేం గట్టి యాక్షన్ తీసుకుంటాం. కానీ ప్రజల ప్రయోజనాల కోసం ప్రపంచ నేతలు, ఆయా దేశాల్లోని కీలక అధికారుల అకౌంట్లకు మాత్రం అదనపు రక్షణ కల్పిస్తాం. వారు ఇచ్చే సమాచారాన్ని యూజర్లందరూ చూసేందుకు వీలు కల్పిస్తాం. ఆందోళన కలిగించే విషయాన్ని అర్థం చేసుకోవడానికి లేదా చర్చించడానికి ఇది నేరుగా దోహదం చేస్తే కంటెంట్ ప్రజా ప్రయోజనంలో ఉంటుందని మేము భావిస్తాం. అయితే, జనవరి 20న పదవిని వీడిన తర్వాత ట్రంప్ కు కూడా సాధారణ పౌరులకు వర్తించే నిబంధనలే వర్తిస్తాయి. ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఉల్లంఘనలకు పాల్పడిన ఆయనపై తగిన చర్యలు తీసుకుంటాం''అని ట్విటర్ సంస్థ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విటర్ హ్యాండిల్స్.. @plotus, @Flotus ఇంకా @whitehouse ను మాత్రం కొత్త ప్రభుత్వానికి బదిలీ అవుతాయని సంస్థ పేర్కొంది.

English summary
Former US President Donald Trump will lose protections against Twitter bans from January 2021. The micro-blogging site has said that Trump will have to follow the same rules as any other user when President-Elect Joe Biden takes over on January 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X