• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డోనల్డ్ ట్రంప్: ఓటమి తరువాత తొలిసారిగా ప్రసంగించిన అమెరికా మాజీ అధ్యక్షుడు.. కొత్త పార్టీ ఏర్పాటుపై వివరణ

By BBC News తెలుగు
|

Donald Trump

వైట్ హౌస్ విడిచి పెట్టిన తరువాత, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారిగా కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో ప్రసంగించారు.

అభిశంసన విచారణలో ట్రంప్‌ను నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో కొందరు రిపబ్లిక్ పార్టీ సభ్యులు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో, ట్రంప్ కొత్త రాజకీయ పార్టీ పెడతారనే వార్తలొచ్చాయి.

అయితే, తనకు అలాంటి ఉద్దేశమేమీ లేదని ట్రంప్ సీపీఏసీ ప్రసంగంలో స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను విమర్శిస్తూ 'అమెరికా ఫస్ట్' నినాదాన్ని 'అమెరికా లాస్ట్'‌కు దిగజార్చారని అన్నారు.

సీపీఏసీ అనేది అమెరికాలో సాంప్రదాయ సిద్ధాంతాలను విశ్వసించేవారు, కార్యకర్తలు, అధికారులు పాల్గొనే ఒక రాజకీయ వార్షిక సమావేశం. ఈసారి జరిగిన సమావేశంలో ట్రంప్ విధేయులు అనేకమంది పాల్గొన్నారు.

జనవరిలో అమెరికా క్యాపిటల్ హిల్ మీద జరిగిన దాడుల తరువాత ట్విట్టర్, ఫేస్‌బుక్ సహా పలు సోషల్ మీడియా వేదికలు ట్రంప్‌పై నిషేధం విధించాయి.

సమావేశంలో ట్రంప్ విధేయులు అనేకమంది పాల్గొన్నారు.

ట్రంప్ ప్రసంగం ముఖ్యాంశాలు

నాలుగేళ్ల క్రితం తాము మొదలుపెట్టిన ప్రయాణం ముగియలేదని.. తమ పార్టీ భవిష్యత్తు, తదుపరి తీసుకోబోయే చర్యలు, దేశ భవిష్యత్తు గురించి మాట్లాడడానికే ఇక్కడకు వచ్చానని ట్రంప్ అన్నారు.

తాను కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నానే ఊహాగానాలను ట్రంప్ కొట్టి పారేశారు. అదంతా ఫేక్ న్యూస్ అని అన్నారు.

"కొత్త పార్టీ ప్రారంభిస్తే, మా ఓట్లు చీలిపోతాయి. అలా అయితే మేము ఎప్పటికీ గెలవలేం. రిపబ్లికన్ పార్టీ ఇంతకుముందు కంటే బలంగా, ఐక్యంగా ఉంటుంది" అని ట్రంప్ స్పష్టం చేశారు.

రిగ్గింగ్ వలనే ఎన్నికల్లో తాను ఓడిపోయానని ట్రంప్ అన్నారు.

జో బైడెన్ విధానాలను విమర్శిస్తూ, వలసలకు సంబంధించిన పాలసీలను దుయ్యబట్టారు.

"బైడెన్ పాలన ఎలా ఉండబోతోందో మనందరికీ తెలుసు. ఆయన హయాంలో ఎంత చెడు జరుగబోతోందో ఎవరూ ఊహించలేరు. వామపక్ష ప్రభుత్వం ఎంతకైనా తెగించగలదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అమెరికాలో ట్రంప్‌కు ఆదరణ తగ్గలేదు. గత వారం అమెరికాలో జరిపిన ఒక సర్వేలో ట్రంప్ మూడో పార్టీ పెడితే 46 శాతం ఓటర్లు వెంట వెళతారని తేలింది.

కాగా, 74 ఏళ్ల ట్రంప్ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Donald Trump:US Former President press meet first time after the defeat,Explains on the formation of a new party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X