వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీసా లాటరీ భయంకరం, అందరికీ అవకాశం: తేల్చిన ట్రంప్, భారత టెక్కీలకు లాభమే!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: ఇప్పటికే వీసా విధానాలను కఠినతరం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలస విధానంపై తన వైఖరిని స్పష్టం చేశారు. న్యాయమైన, సమాన అవకాశాలు కల్పించే, ప్రతిభ ఆధారిత వలస విధానానికే తన మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు.

భారత్-అమెరికాకు ఆకాశమే హద్దు, మోడీ-ట్రంప్ కాంబినేషన్ సూపర్: నిక్కీ హేలీ ప్రశంసలుభారత్-అమెరికాకు ఆకాశమే హద్దు, మోడీ-ట్రంప్ కాంబినేషన్ సూపర్: నిక్కీ హేలీ ప్రశంసలు

అంతేగాక, లాటరీ వీసా విధానాన్ని భయంకరమైనదిగా అభివర్ణించారు ట్రంప్. వెస్ట్‌ వర్జీనియాలో హౌస్‌, సెనేట్‌ రిపబ్లికన్‌ మెంబర్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

సమాన అవకాశాలు.. గౌరవం

సమాన అవకాశాలు.. గౌరవం

న్యాయమైన, అందరికీ సమాన అవకాశాలు కల్పించే వలస విధానాన్ని తాము కోరుకుంటున్నామని, అది అమెరికన్లకు రక్షణ కలిగించే విధంగా ఉండాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ దేశానికి వచ్చే వాళ్లు ప్రతిభ ఆధారంగా రావాలని కోరుకుంటున్నామని... అలాగే తమ దేశం, తమ ప్రజల పట్ల ప్రేమ, గౌరవం ఉండాలని స్పష్టం చేశారు.

భారత టెక్కీలకు లాభమే

భారత టెక్కీలకు లాభమే

తమకు వీసా లాటరీ విధానం అస్సలు వద్దని, లాటరీ టికెట్‌ తీసుకున్నట్లు ఉండే విధానం తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాగా, ట్రంప్‌ వ్యాఖ్యలకు రిపబ్లికన్‌ నేతల నుంచి మంచి స్పందన వచ్చింది. ట్రంప్‌ ప్రతిపాదిస్తున్న ప్రతిభ ఆధారిత వలస విధానంతో భారతీయ టెక్కీలకు లాభం చేకూరనుంది.

డాకా చట్టానికి పరిష్కారం

డాకా చట్టానికి పరిష్కారం

‘డాకా' చట్టానికి శాశ్వత పరిష్కారం చూపే వలస విధానాలకు పది మంది అమెరికన్లలో ఏడుగురు మద్దతిస్తారని ట్రంప్‌ తెలిపారు. సరైన పత్రాలు లేకుండా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల వెంట అమెరికాకు వలస వచ్చిన వారిని డ్రీమర్లుగా పిలుస్తున్నారు. వీరికి అమెరికాలో చదువుకునేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు తాత్కాలిక హక్కులు కల్పించడం కోసం డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్ హుడ్‌ అరైవల్స్‌ (డాకా) చట్టం అమలులో ఉంది.

డ్రీమర్లను మర్చిపోకూడదు

డ్రీమర్లను మర్చిపోకూడదు

కాగా, వలసదారులు మాత్రమే డ్రీమర్లు కాదని, ఇక్కడ కూడా ఎంతో మంది డ్రీమర్లు ఉన్నారని ట్రంప్ చెప్పారు. అంతేగాక, అమెరికా ఇక్కడి డ్రీమర్లను మర్చిపోకూదని ట్రంప్‌ పేర్కొన్నారు. డెమోక్రాట్లు మన డ్రీమర్లకు సహకరించడం లేదని ఆరోపించారు. ‘డాకా' చట్టాన్ని కూడా కాపాడాలని అనుకుంటున్నామని ట్రంప్‌ తన వైఖరిని తెలియజేశారు.

English summary
Speaking at the GOP Congressional Retreat in Sulfur Springs, WVa, Thursday, he said: ‘We need to end chain migration and we need to cancel the terrible visa lottery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X