వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు సిద్దం: ట్రంప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియా దూకుడుకు చెక్ పెట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేయడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తరకొరియాపై విరుచుకుపడ్డారు.

కిమ్‌కు షాక్: బాంబులతో విరుచుకపడిన దక్షిణ కొరియాకిమ్‌కు షాక్: బాంబులతో విరుచుకపడిన దక్షిణ కొరియా

త‌న తీరు మార్చుకోని ఉత్త‌ర‌కొరియా మ‌రోసారి న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్‌ లు నిర్వహించిన విష‌యంపై ఇప్ప‌టికే రష్యా, జపాన్‌, ద‌క్షిణ కొరియా, చైనా ఆందోళన వ్య‌క్తం చేశాయి. ఇటువంటి తీవ్ర‌ చ‌ర్య‌లు ఉత్తర కొరియాను ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేస్తాయని ట్రంప్ చెప్పారు

. ఆ దేశం పంపుతున్న‌ సంకేతాలను ప్రపంచం గమనిస్తోంద‌ని అన్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజాన్ని ధిక్కరించేలా ఉత్త‌ర‌కొరియా చ‌ర్య‌లు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు.

జ‌పాన్‌ ప్రధాని షింజో అబేతో డొనాల్డ్‌ ట్రంప్ ఈ రోజు మాట్లాడారు. ఉత్తర కొరియా చర్య‌లు ప్రపంచానికి ప్ర‌మాద‌క‌ర‌మని ఇరు దేశాల అగ్ర‌నేత‌లు అభిప్రాయపడినట్టు శ్వేత‌సౌధం తెలిపింది.

English summary
unprecedented North Korea missile test over one of Japan's main islands, warning it that "all options are on the table" for a US response.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X