వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జో బైడెన్ కాలుకి గాయం, వారాలపాటు వాకింగ్ బూటుతోనే నడక, కోలుకోవాలంటూ ట్రంప్ విషెస్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాలికి గాయమైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఆయన తన పెంపుడు శునకంతో ఆడుతున్న సమయంలో కాలు బెనికింది. దీంతో కాబోయే అమెరికా అధ్యక్షుడైన బైడెన్‌ను కట్టుదిట్టమైన భద్రత నడుమ 'డెలావేర్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్స్' ఆస్పత్రికి తరలించారు.

Recommended Video

US Election 2020:అధికార బదిలీ చేయాల్సివస్తే... చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేస్తున్నాం!-White House

బైడెన్‌కు వైద్య నిపుణులు ఎక్స్‌రే, సిటీ స్కాన్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత కాలి ఎముక విరగలేదని భావించినప్పటికీ.. మరింత స్పష్టత కోసం బైడెన్‌కు మరోసారి స్కానింగ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈ స్కానింగ్ ఫలితాల్లో ఆయన పాదంలో స్వల్పంగా పగులు చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు.

Donald Trump wishes Joe Biden get well soon, after President-elect twists ankle playing with his dog

78 ఏళ్ల బైడెన్ కొన్ని వారాలపాటు వాకింగ్ బూట్ సహాయంతో నడవాల్సిందిగా వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు జో బైడెన్ కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారు.

ఇది ఇలావుండగా, బైడెన్ త్వరగా కోలుకోవాలని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు. జో బైడెన్ ఆస్పత్రికి వెళ్లినట్లు ఉన్న ఓ వీడియో ట్వీట్‌ను కూడా ట్రంప్ రీట్వీట్ చేశారు.

కాగా, ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్‌పై భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ మాత్రం అధికారాన్ని బదిలీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో అధికార బదిలీపై కొంత ఉత్కంఠ ఏర్పడింది. అధ్యక్ష పదవి చేపట్టేందుకు జో బైడెన్‌కు మరికొంత సమయం ఉండటంతో వేచిచూస్తున్నారు. ఇటీవల వెలువడిన పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లోనూ జో బైడెన్ విజయం సాధించడం గమనార్హం.

English summary
Donald Trump wishes Joe Biden get well soon, after President-elect twists ankle playing with his dog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X