కడుపులో డజన్ల కొద్ది గుడ్లు
నైజీరియా :పశ్చిమ ఆప్రికాలోని నైజీరియాకు చెందిన ఓ గ్రామంలో ప్రతి రోజు ఏదో ఒక పెంపుడు జంతువు అదృశ్యమౌతోంది. ఈ జంతువుల అదృశ్యం వెనుక కారణాలను కనుగొనేందుకు ప్రయత్నించిన గ్రామస్థులు చివరికి ఆశ్చర్యపోయారు.
పశ్చిమ ఆఫ్రికాలోని నైజారియాలో ఓ గ్రామంలో ప్రతి రోజు దూడ, కోడి లాంటి చిన్న చిన్న జంతువులు అదృశ్యమౌతున్నాయి. ఈ జంతువుల అదృశ్యాన్ని కనుగొనేందుకు ప్రయత్నించిన గ్రామస్థులకు చివరికి ఆశ్చర్యపోయారు.
అదృశ్యమైన జంతువుల కోసం వెతుకుతున్న గ్రామస్థులకు ఓ బారీ పాము కన్పించింది. ఈ పాము అతి కష్టంగా కదులుతోంది. తమ గ్రామానికి చెందిన పెంపుడు జంతువులు కన్పించకపోవడానికి కారణంగా పామును భావించారు గ్రామస్థులు.
పామును వెంటనే చంపివేశారు. పాము పొట్టలో చూస్తే తమ పెంపుడు జంతువుల ఆనవాళ్ళు కన్పిస్తాయని భావించిన వారికి నిరాశే ఎదురైంది. పాము పొట్ట నిండా గుడ్లు కన్పించాయి. ఈ గుడ్లు కూడ పొదగడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ గుడ్లను పొదిగేందుకు ఉన్న కారణంగా పాము అతికష్టంగా కదులుతోందని గ్రామస్థులు గుర్తించారు. పాము పొట్టనిండా డజన్ల కొద్ది గుడ్లను వెలికితీశారు. అయితే తమ గ్రామానికి చెందిన పెంపుడు జంతువుల ఆచూకీని మాత్రం వారు కనిపెట్టలేకపోయారు.