వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: విష వాయువులతో సిరియాలో దాడి, 42 మంది మృతి

By Narsimha
|
Google Oneindia TeluguNews

డమస్కస్:సిరియా రాజధాని డమస్కస్‌కు సమీపంలోని డౌమా పట్టణంలో విష రసాయనిక దాడుల్లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో అత్యధికులు చిన్నపిల్లలు ఉన్నారని నివేదికలు తెలుపుతున్నాయి. మరోవైపు వందలాది మంది తీవ్రంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రభుత్వ సైనికులే ఈ దాడికి పాల్పడి ఉంటారని ప్రచారం సాగుతోంది.

సిరియాలో అంతర్యుద్దం సాగుతోంది. ప్రభుత్వ దళాలకు వేర్పాటు దారులకు మధ్య సామాన్యులు నలిగిపోతున్నారు. ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ కొన్ని దేశాలు. వేర్పాటు వాదులకు కొందరు సహయంగా ఉంటున్నారు.

సిరియా యుద్ద బాధిత దేశంగా మారింది. ఈ తరుణంలో అమాయకులైన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అన్నెం పున్నెం తెలియని చిన్నారులు మృత్యువాతపడుతున్నారు.

టాక్సిక్ గ్యాస్ దాడిలో 42 మంది మృతి

టాక్సిక్ గ్యాస్ దాడిలో 42 మంది మృతి

విష రసాయనిక దాడుల్లో సిరియా రాజధాని డమస్కస్‌కు సమీపంలోని డౌమా పట్టణంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. వీరిలో చిన్నారులే అత్యధికంగా ఉన్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. విషపూరితమైన గ్యాస్ దాడిగా వైద్యులు చెబుతున్నారు. టాక్సిస్ యాసిడ్‌ దాడిగా వైద్యులు గుర్తించారు. ఇప్పటివరకు సుమారు 42 మంది చనిపోయారు.వందలాది మంది గాయపడ్డారు.

 ఆర్గానిక్ ఫాస్పరస్ సమ్మేళనంతో దాడి

ఆర్గానిక్ ఫాస్పరస్ సమ్మేళనంతో దాడి


ఆర్గాన్‌ ఫాస్ఫోరస్‌ సమ్మేళనంతో ఈ దాడి జరిగిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ రసాయనం గాలిలో వ్యాపించడంతో ప్రజలు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. అంతేకాదు చిన్నారులు మృత్యువాత పడ్డారని వైద్యులు చెబుతున్నారు. దీని ప్రభావం వందలాది మందిపై ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

రసాయనాల దాడులు

రసాయనాల దాడులు

తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న తూర్పు ఘౌటా ప్రాంతంపై అధ్యక్షుడు అసద్‌ సైన్యం రసాయనిక దాడి జరపడం కొనసాగుతూనే ఉంది.. ప్రభుత్వ సైనిక ముట్టడిలో ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల క్లోరైన్‌ రసాయనిక దాడులు జరిగాయి. తాజాగా మరోసారి రసాయనిక దాడి చోటు చేసుకొంది. 2013లో సరిన్‌ గ్యాస్‌ దాడి జరిగింది.ప్రభుత్వ సైన్యం విచ్చలవిడిగా జరుపుతున్న వైమానిక దాడులు, రసాయనిక దాడులతో బెంబేలెత్తుతున్న ప్రజలు, కొందరు తిరుగుబాటుశ్రేణులు కూడా ఆ ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో వలస వెళ్లిపోతున్నారు

భయబ్రాంతులు చేసేందుకే

భయబ్రాంతులు చేసేందుకే


ఘౌటా ప్రాంతంలోని డౌమా పట్టణంలో ఉన్న షెల్టర్ల వద్ద తాజా దాడి జరిగింది. బాంబు దాడులు జరిగినా సురక్షితంగా ఉండేందుకు ఉద్దేశించిన ప్రాంతాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి.. బెదరగొట్టేందుకు ఈ గ్యాస్‌ దాడి జరిగి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. దట్టమైన గ్యాస్‌ దాడి వల్ల చిన్నారులు ఊపిరి ఆడక మరణిస్తున్నారు.

 అమెరికా సీరియస్

అమెరికా సీరియస్

రెబల్స్‌ అధీనంలోని డౌమా పట్టణంపై రసాయనిక దాడి జరిగిన నేపథ్యంలో సిరియా, రష్యా ప్రభుత్వాలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసద్‌ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నందుకు ఈ దాడికి రష్యానే బాధ్యత వహించాలని ఘాటుగా పేర్కొంది. అసద్‌ ప్రభుత్వానికి, ఘౌటాను తమ అధీనంలో ఉంచుకున్న తిరుగుబాటుదారులకు రాజీ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఆదివారం ఉదయం ఈ ప్రాంతంపై మళ్లీ ప్రభుత్వ సేనలు వైమానిక దాడులు ప్రారంభించాయి.

English summary
Dozens of people have been killed in what local medics said was a toxic gas attack on the besieged town of Douma near Damascus. Videos and images showed bodies of dead children and other family members, some foaming at the mouth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X