వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడులతో సిరియా విలవిల: ఐసిస్ కెమికల్ యుద్ధం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీరుట్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లక్ష్యంగా సిరియా పైన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న బాంబుల వర్షానికి అమాయకులు కూడా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడుల్లో ఆదివారం నాడు ఒక్కరోజే 31 మంది చనిపోయారని మానవ హక్కుల సఘం పరిశీలకుడు రమీ ఆబ్దెల్ చెబుతున్నాడు.

అంతకంటే ఎక్కువ ఉందని స్వచ్చంధ సంస్థలు చెబుతున్నాయి. తూర్పు ఘౌటా ప్రాంతంలోని ధౌమా, సక్భా పట్టణాల పైన సిరియన్, రష్యా దళాలు రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డాయి. ధౌమాలోని ఓ పాఠశాలలో వైమానిక దాడికి గురైంది. అందులోని ప్రధానోపాధ్యాయుడు చనిపోయాడు. చాలామంది గాయపడ్డారు.

డమాస్కస్ పైన సిరియా ప్రభుత్వ దళాలు రాకెట్ లాంచర్లు, మోర్టారు షెల్స్‌తో దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఎన్నో భవనాలు నేలకొరిగాయి. చిన్నారుల హృదయ విధారక దృశ్యాలను స్వచ్ఛంద సంస్థలు ఫేస్‌బుక్‌లో పెట్టాయి. బాంబు దాడులతో సిరియాలో, యెమెన్‌లో ఎనభై మందికి పైగా మృతి చెందారు.

Dozens of Syrian civilians killed in air strikes

మరోవైపు, ఐసిస్ ఉగ్రవాదులు రసాయ ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారా? అగ్ర రాజ్యాల పైన దాడులకు రసాయ ఆయుధాలు వినియోగించాలని ప్రణాళికలు వేసుకున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఐసిస్ అగ్రరాజ్యాలను కలవరపెడుతోంది.

రసాయన ఆయుధాల తయారీ కోసం అవసరమైన నిపుణులను ఐసిస్ ఉగ్రవాదులు రిక్రూట్ చేసుకుంటున్నారని ఓ నివేదిక పేర్కొంది. కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగంలో నిపుణులను ఐసిస్ నియమించుకుంటోందని ఆ నివేదికలో వెల్లడైంది.

English summary
Dozens of Syrian civilians killed in air strikes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X