వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారానికి 4సార్లు అల్కాహాల్ తాగితే ప్రమాదమే: తొందరగా చనిపోయే అవకాశం

|
Google Oneindia TeluguNews

Recommended Video

వారానికి నాలుగుసార్లుకంటే ఎక్కువ మద్యం తాగితే ప్రమాదం

న్యూయార్క్: వారానికి నాలుగుసార్లు అంతకంటే ఎక్కువ మద్యం తాగితే ముందు చనిపోవడానికి ఇరవై శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. ఓ గ్లాస్ వైన్ తాగితే ఆరోగ్యానికి మంచిదేనని, పరిమిత స్థాయిలో అల్కాహాల్ అవసరమేనని గతంలో అధ్యయనాలు తెలిపాయి. కానీ తాజా అధ్యయనం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

వారానికి నాలుగు సార్లు, అంతకంటే ఎక్కువ రోజులు ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్లు తొందరగా చనిపోయే అవకాశముందని తేలింది. ఆల్కహాలిజం-క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ రీసెర్చ్ అనే జర్నల్‌లో దీని తాలూకు ఫలితాలను ప్రచురించారు. రోజూ చాలా తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకున్న వాళ్లు కూడా తొందరగా చనిపోయే ప్రమాదముందని సైకియాట్రీ ప్రొఫెసర్ సారా హార్ట్ చెప్పారు.

Drinking alcohol four times per week increases the risk of early death: Study

పద్దెనిమిది నుంచి 85 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 4 లక్షల మంది అమెరికన్లపై అధ్యయనం చేశారు. వారానికి మూడు లేదా అంతకంటే తక్కువసార్లు మద్యం తీసుకున్న వాళ్లతో పోలిస్తే, నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు తాగుతున్న వాళ్లు మరణించే అవకాశం ఇరవై శాతం ఎక్కువగా ఉన్నట్లు వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు గుర్తించారు. అన్ని వయసుల వాళ్లకు రిస్క్ ఒకేలా ఉన్నట్లు తేలింది.

ఒకటీ, రెండు పెగ్గులు గుండెకు మంచిది అన్న వాదన ఉన్నప్పటికీ, ప్రతి రోజూ తాగడం వల్ల ఆ లాభాలు పక్కకెళ్లిపోతున్నాయని చెప్పారు. ఎంత అల్కాహాల్ తీసుకున్నా ప్రమాదమేనని కూడా ఓ అధ్యయనం తేల్చింది.

English summary
A glass of wine has been linked to various health benefits earlier but the latest research on the subject published in the journal ‘Alcoholism: Clinical and Experimental Research’, has shown that consuming alcohol on four or more days of the week increases your risk of early death by 20 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X