వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారుతో సహా భారీ వరద మధ్యలో చిక్కుకున్న డ్రైవర్‌ను ఇలా కాపాడారు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో వరదల్లో చిక్కుకుపోయిన ఓ కారు డ్రైవర్‌ను ఫైర్ ఫైటర్స్ రక్షించారు. ఓ నిచ్చెనతో పలువురు ఫైర్ ఫైటర్స్ అతనిని కాపాడారు. భారీ వరద మధ్యలో చిక్కుకున్న ఆ డ్రైవర్‌ను కాపాడినందుకు సదరు ఫైర్ ఫైటర్స్ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఈ సంఘటన తూర్పు చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను చైనా గ్లోబల్ టీవీ నెట్ వర్క్ (సీజీటీఎన్) షేర్ చేసింది.

Driver Rescued From Middle Of Flooded River In China

ఈ వీడియోలో భారీగా పొంగుతున్న వరదలో కారు చిక్కుకుపోయింది. దాదాపు నడి మధ్యలో చిక్కుకుంది. అందులో కారు డ్రైవర్ ఉన్నాడు. విషయం తెలిసి ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు. పలువురు కలిసి అతనిని కాపాడారు. అతనికి ఎలాంటి పెద్ద గాయాలు కాలేదు.

ఫైర్ ఫైటర్స్ ఒడ్డు నుంచి కారు పైకి నిచ్చెన వేశారు. పైన తాళ్లు కట్టి, దాని సహాయంతో కాపాడారు. నిచ్చెన, తాడు సహాయంతో ఓ ఫైర్ ఫైటర్ డ్రైవర్ దగ్గరకు వెళ్లి, కాపాడాడు. డ్రైవర్, ఫైర్ ఫైటర్స్ బయటకు వచ్చిన కాసేపటికి వరద మధ్యలో చిక్కుకుపోయిన కారు కొట్టుకుపోయింది.

అక్కడకు వచ్చిన ఎంతోమంది దీనిని వీడియో తీశారు. దీనిని శనివారం ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. దీనిపై ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో.. గ్రేట్ వర్క్, సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

English summary
Firefighters in China have earned accolades for rescuing a man from his car that was stuck in the middle of a surging, flooded river. The incident took place in the Zhejiang Province of east China, and a video of the dramatic rescue was shared by China Global TV Network (CGTN). The video shows a team of firefighters working together to rescue an unnamed man from heavy floods. The man, thankfully, managed to escape without any serious injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X