వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత: డ్రైవర్ లేని ఈజెడ్ 10 బస్సు ఇదే (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఫిన్లాండ్: పాత వాహనాలు వదిలించుకుని టెక్నాలజీ ఆసరాతో కొత్తకొత్త వింతలు సృష్టిస్తున్నారు. డీజల్, పెట్రోల్ లేకుండా బస్సులు నడుస్తున్నాయి. అందులో డ్రైవర్, కండెక్టర్ కూడా ఉండరు. చూద్దాం అంటే స్టీరింగ్ కనపడదు.

ప్రపంచంలోనే మొదటిసారి పూర్తిగా విద్యుత్ తో డ్రైవర్లు లేకుండా నడుస్తున్న ఈజెడ్-10 బస్సులు ఆకర్షనీయంగా, అద్బుతంగా ఉన్నాయి. ముందుగా నిర్దేశించిన మార్గంలో షటిల్ సర్వీస్ చేసేందుకు ఫిన్లాండ్ లో ఈజెడ్-10 బస్సులు వాడుతున్నారు.

అత్యాధునిక కెమెరాలు, సెన్సర్లు సరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ జీపీఎస్ వంటి అప్లికేషన్స్ సాయంతో ఈ బస్సులు గమ్యం చేరుకుంటున్నాయి. ఒకే సారి 12 మంది ప్రయాణికులు ఈజెడ్-10 బస్సులో ప్రయాణించడానికి అవకాశం ఉంది.

 Driverless EZ 10 buses being tested in Finland

పిల్లలు, వికలాంగులు వీల్ చేర్ లో బస్సులో ఎక్కడానికి ప్రత్యేక మైన ర్యాంప్ ఉంది. నిర్దేశిత రూట్లలో మొబైల్ యాప్ ద్వారా కూడా బస్సు సర్వీలు పొందడానికి అవకాశం ఉంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఈజెడ్-10 బస్సులు ప్రయాణిస్తాయి.

2021 నాటికి ప్రపంచంలో దాదాపు అన్నీ ఇలాంటి ఈజెడ్-10 బస్సులు ఉపయోగిస్తారని అంచనా వేస్తున్నారు. ఎయిర్ పోర్టు, మెట్రో స్టేషన్లు, పెద్ద పెద్ద మాల్స్ లో ఇటు నుంచి అటు వైపు సంచరించడానికి ఈజెడ్ 10 బస్సులు ఉపయోగిస్తున్నారు.

English summary
Finland has already released a fleet of driverless buses on its public roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X