వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీటింగ్‌ కేసులో ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ళ జైలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

దుబాయ్:200 మిలియన్‌ డాలర్ల మోసం చేసిన కేసులో ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ దుబాయ్‌ కోర్టు ఈ తీర్పు సంచలన తీర్పు చెప్పింది. ఇండియాలోని గోవా రాష్ట్రానికి చెందిన సిడ్నీ లెమోస్‌తో పాటు అతడి భార్య వలనీ, రేయాన్ డీసౌజాలకు శిక్షను విధిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని స్పెషల్ కోర్టు సంచలన తీర్పును చెప్పింది.

గోవాకు చెందిన సిడ్నీ లెమోస్ దంపతులు 200 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ఈ మోసానికి పాల్పడిన వీరికి 517 ఏళ్ళ పాటు జైలు శిక్షను విధిస్తున్నట్టు మొహమ్మద్ హనాఫీ తీర్పు వెల్లడించారు.

Dubai court sentences two Indians to over 500 years in jail

ఈ ముగ్గురిపై ఒక్కొక్కరిపై 500కు పైగా కేసులు నమోదయ్యాయి. లక్షల డాలర్ల మోసాలకు పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఈ విషయమై నిందితులపై అభియోగాలు రుజువయ్యాయి.

ఈ కేసులో కోర్టు ఎటువంటి శిక్షను వెలువరుస్తోందననే ఆసక్తితో వందలాది మంది ఎదురుచూశారు. ఈ ముగ్గురు నిందితుల చేతుల్లో మోసపోయిన బాధితులు కూడ కోర్టు హల్‌ వద్దకు చేరుకొన్నారు. కోర్టు తీర్పును ప్రత్యక్షంగా వినేందుకు ఆసక్తిని చూపారు.నిందితుల నుండి నగదును స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు.

English summary
The Dubai misdemeanours court sentenced two Indians to 517 years in jail each for duping thousands of investors in a $200 million (Rs 13 billion) fraud case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X