వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొట్ట కోసేస్తారా? ఐతే చివరిసారి బిర్యానీ తింటాను సార్!: వైద్యుడికి క్యాన్సర్ బాధితుడి వేడుకోలు

|
Google Oneindia TeluguNews

దుబాయ్: బిర్యానీ అంటే అతనికి ఎంతో ఇష్టం. కానీ, అతను ఇక తనకు ఇష్టమైన ఆహారాన్ని దాదాపు మానివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో తాను తన జీవిత కాలంలో చివరి సారిగా బిర్యానీ తింటాను సార్.. అంటూ వైద్యుడిని ఆ ఆ క్యాన్సర్ బాధితుడు ఎంతో దీనంగా బతిమాలుకున్నాడు. ఈ ఘటన దుబాయ్‌లో చోటు చేసుకుంది.

 ఒక్కసారిగా బరువు తగ్గడంతో ఆందోళన

ఒక్కసారిగా బరువు తగ్గడంతో ఆందోళన

వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌కి చెందిన గులాం అబ్బాస్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, కొన్ని రోజులుగా అతనికి విపరీతంగా వాంతులు అవుతున్నాయి. ఒక్కసారిగా బరువు కూడా తగ్గాడు. దీంతో ఆందోళన చెందిన అబ్బాస్.. వైద్యుడిని సంప్రదించాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. అబ్బాస్‌కు ఉదర క్యాన్సర్ వచ్చిందని తేలింది.

ఉదరాన్ని తొలగించాల్సిందేనని డాక్టర్లు..

ఉదరాన్ని తొలగించాల్సిందేనని డాక్టర్లు..

ఆ క్యాన్సర్ మూడో దశలో ఉండటంతో ఉదర భాగాన్ని తొలగించాలని వైద్యులు స్పష్టం చేశారు. లేదంటే ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు. దీంతో గులాం అబ్బాస్ తీవ్ర వేదనకు గురయ్యాడు.

చివరి సారిగా బిర్యానీ తింటానంటూ అబ్బాస్..

చివరి సారిగా బిర్యానీ తింటానంటూ అబ్బాస్..


ఈ క్రమంలో శస్త్ర చికిత్సకు ఒక రోజు ముందు రోజు తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీ తినాలని ఉందని వైద్యుడిని కోరాడు. ఇక ఎట్లాగూ ఉదర భాగాన్ని తొలగిస్తున్నాం కాదా అని వైద్యుడు కూడా అందుకు అంగీకరించారు. దీంతో గులాం భార్య ఇంట్లో రుచికరమైన బిర్యానీ వండి ఆస్పత్రికి తెచ్చింది. ఇంకేం ఎంతో ఆనందంగా ఆ బిర్యానీని లాగించేశాడు అబ్బాస్.

ఉదరం లేకపోయినా.. వైద్యుల క్లారిటీ..

ఉదరం లేకపోయినా.. వైద్యుల క్లారిటీ..


కాగా, అబ్బాస్ ఉదర భాగాన్ని తొలగించినంత మాత్రాన ఇక అతడు ఏమీ తినలేడని కాదు. కాకపోతే ఎక్కువ కారం, మసాలతో ఉన్న ఆహార పదార్థాలను కాకుండా స్వల్పాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ‘ఉదరం(పొట్ట) లేకుండా ఓ మనిషి ఎలా జీవిస్తాడు? అని చాలా మంది అడిగే ప్రశ్నే. కానీ, ఉదరం లేకున్నా తిన్న ఆహారాన్ని జీర్ణించుకోగలిగే సామర్థ్యం శరీరానికి ఉంటుంది. కాకపోతే భారీ మొత్తంలో కాకుండా స్వల్ప మోతాదులో తింటూ ఉండాలి' అని కన్సల్టెంట్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అలమ్ మర్జూకీ తెలిపాడు.

English summary
When Ghulam Abbas, an engineer in Dubai, walked into a doctor's clinic complaining of sudden weight loss and vomiting, he didn't expect his life to change forever. Abbas was diagnosed with stage-three stomach cancer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X