• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దుబాయ్ రాజుగారి ఆరో భార్య గుట్టు రట్టు -బాడీగార్డుతో ప్రిన్సెస్ హాయా అఫైర్ -అందుకు రూ.12కోట్లు

|

అవతలి వ్యక్తి రాజకుమారి అయితేనేం? తన భర్తను వలలో వేసుకునే వగలాడిని ఏ భార్య క్షమించబోదు. కాస్త ధైర్యవంతురాలైతే.. అక్రమ సంబంధం సాగిస్తోన్న ఆ ఇద్దరినీ రోడ్డుకీడ్చి రచ్చ చేస్తుంది. ప్రస్తుతం రసెల్ ఫ్లవర్ భార్యదీ అదే పరిస్థితి. బాడీగార్డు అయిన తన భర్తతో దుబాయ్ యువరాణి హాయా కొనసాగించిన వివాహేతర బంధంపై ఆమె కస్సుబుస్సులాడుతోంది. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచేదుకు బాడీగార్డుకు యువరాణి ఇచ్చిన డబ్బుల వ్యవహారాలన్నీ కోర్టు సాక్షిగా బయట పడగా.. సదరు విచారణ తాలూకు వివరాలతో ప్రఖ్యాత బ్రిటిష్ మీడియా సంస్థ'డెయిలీ మెయిల్' సంచలన కథనాన్ని ప్రచురించింది. వివరాల్లోకి వెళితే..

చైనా బరితెగింపు:యుద్ధానికి వీలుగా సరిహద్దులో కొత్త ఆర్మీ కంటోన్మెంట్లు -శాటిలైట్ చిత్రాల్లో బట్టబయలుచైనా బరితెగింపు:యుద్ధానికి వీలుగా సరిహద్దులో కొత్త ఆర్మీ కంటోన్మెంట్లు -శాటిలైట్ చిత్రాల్లో బట్టబయలు

రాజుగారి ఆరో భార్య..

రాజుగారి ఆరో భార్య..

దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్(71) అధికారికంగా మూడు, అనధికారికంగా మరో మూడు.. మొత్తం కలిపి ఆరు పెళ్లిళ్లు చేసుకున్నారు. రాజుగారి ఆరో భార్య, యువరాణి హాయాకు ప్రస్తుతం 46 ఏళ్లు. 2004, ఏప్రిల్ 10న పెళ్లి చేసుకున్న ఈ జంట.. 2019 ఫిబ్రవరిలో విడిపోయింది. విడాకులతోపాటు ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతపై లండన్ కోర్టులో సాగిన విచారణ వివరణాలను, బాడీగార్డు భార్య వెర్షన్ ను జోడించి ‘డెయిలీ మెయిల్' కథనాన్ని రాసింది. అందులో..

చంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రంచంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రం

బాడీగార్డుతో జల్సా.. భారీగా..

బాడీగార్డుతో జల్సా.. భారీగా..

దుబాయ్ యువరాణి హాయా తన బ్రిటిష్ బాడీగార్డ్ రస్సెల్ ఫ్లవర్‌(37)తో రెండేళ్లపాటు రహస్యంగా అఫైర్ కొనసాగించిందని, ఈ సంబంధాన్ని దాచిపెట్టి ఉంచేందుకు అతడికి 1.2 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు (దాదాపు రూ. 12 కోట్లు) ఇచ్చినట్టు కథనంలో పేర్కొన్నారు. అంతేకాదు, అతడికి 12వేల పౌండ్ల విలువైన వాచ్, వింటేజ్ షాట్‌గన్‌తోపాటు ఖరీదైన బహుమతులు ఇచ్చినట్టు వివరించారు. బాడీగార్డ్ ఎప్పుడూ తన వెంట తిరిగేలా హాయా అతడిని సమ్మోహితుడిని చేసిందని, అందుకోసం తన సొమ్మును కూడా ఉపయోగించిందని కథనంలో చెప్పారు. కాగా..

బాడీగార్డుకు భార్య విడాకులు..

బాడీగార్డుకు భార్య విడాకులు..


యువరాణి హాయాతో అక్రమ సంబంధంపై బాడీగార్డు రస్సెల్ భార్య తీవ్రంగా స్పందించినట్లు ‘డెయిలీ మెయిల్' పేర్కొంది. డబ్బులు, ఖరీదైన బహుమతులు ఇచ్చి యువరాణి హాయా తన భర్తను ఆమె వైపు తిప్పుకుందని రస్సెల్ భార్య ఆరోపించింది. ఖరీదైన బహుమతులు ఇవ్వడం ద్వారా రస్సెల్‌ను హాయా తన వెంట తిప్పుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రస్సెల్‌కు, యువరాణి హాయాకు మధ్య ఉన్న బంధం గురించి తెలిసిన తర్వాత ఫ్లవర్ భార్య ఒక్కసారిగా షాక్‌‌కు గురై ఏడ్చేసిందని, భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించిందని కథనంలో పేర్కొన్నారు.

  United Arab Emirates : 12 దేశాలకు విజిటర్స్ విసాలను రద్దు చేసిన UAE
  బండారం బయట పడిందిలా..

  బండారం బయట పడిందిలా..

  దుబాయ్ రాజు మక్తౌమ్, ఆయన ఆరోభార్య ప్రిన్సెస్ హాయాల విడాకుల కేసుపై లండన్ హైకోర్టులో విచారణ సందర్భంగా రహస్య బంధం వెలుగులోకి వచ్చింది. పిల్లల సంరక్షణ బాధ్యతను ఎవరికి అప్పగించాలన్న విషయం గురించి విచారణ జరుగుతుండగా హాయా.. తన బాడీగార్డుతో ఉన్న రహస్య బంధం గురించి వెల్లడించింది. తన బాడీగార్డుల్లో ఒకరితో తనకు వివాహేతర సంబంధం ఉందని అంగీకరించింది. కాగా, చివరికి కోర్టు.. ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతను తల్లి హాయాకే అప్పగిస్తూ తీర్పు చెప్పింది. ప్రస్తుతం హాయా పశ్చిమ లండన్‌లోని కెన్సింగ్టన్‌లో నివసిస్తోంది. రస్సెల్ ఫ్లవర్ కూడా భార్య నుంచి విడాకులు పొందిన తర్వాత ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించే అవకాశమున్నట్లు కథనంలో తెలిపారు.

  English summary
  Princess Haya, who was the sixth wife of Dubai ruler Sheikh Mohammed Al Maktoum, paid around Rs 12 crore to her British bodyguard lover to keep quiet about their two-year-long affair, a report said on Monday. It added that Haya also paid a similar amount to three other Dubai royal family bodyguards, who came to know about the alleged affair. They were probably ‘bought off’ for not discussing the affair.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X