వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్యం: 2020లో అమెరికా అధ్యక్ష బరిలో 'ది రాక్'!

2020లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటూ ప్రకటించిన జాన్సన్.. ట్రంప్ కన్నా తానే బాగా పనిచేస్తానని తనకు తాను కితాబిచ్చుకున్నాడు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: రెజ్లర్ గాను, యాక్టర్ గాను తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న ప్రముఖ హాలీవుడ్ హీరో డ్వెయిన్ జాన్సన్(రాక్) భవిష్యత్తులో రాజకీయాల్లోకి కూడా రావాలని భావిస్తున్నారు. ఈ మేరకు తన మనసులోని మాటను బయటపెట్టారు. 2020లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటూ ప్రకటించిన జాన్సన్.. ట్రంప్ కన్నా తానే బాగా పనిచేస్తానని తనకు తాను కితాబిచ్చుకున్నాడు.

అగ్రరాజ్యానికి అధ్యక్షుడవడం అంత సాధారణమైన విషయమేమి కాదని, కానీ తన విషయంలో మాత్రం అది సాధ్యమేనని చెప్పుకొచ్చారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానెవరికీ ఓటేయలేదని తెలిపాడు. ఒకవేళ తానే గనుక అధ్యక్షుడినైతే అందరిని కలుపుకుని ముందుకెళ్తానని, తనను వ్యతిరేకించేవారిని సైతం తప్పు పట్టనని చెప్పాడు.

Dwayne Johnson for america President!

కాగా, డ్వేన్ జాన్సన్ నల్ల జాతికి చెందిన సమోవన్ అనే తెగకు చెందినవాడు. రెజ్లర్ గా, యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తను అమెరికాలోని అన్ని వర్గాలకు బాగా దగ్గరయ్యాడు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే యాక్టర్ గాను చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం బేవాచ్ అనే హాలీవుడ్ సినిమాలో జాన్సన్ నటిస్తున్నాడు. భారతీయ నటి ప్రియాంక చోప్రా సైతం ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది.

English summary
The magazine mentions that last year, The Washington Post published an op-ed suggesting the WWE wrestler-turned-actor could be a viable candidate for the post now occupied by Donald Trump, a former reality TV star himself. Since then, Johnson told GQ that he's been really thinking about it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X