వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ 22: ధరిత్రీ దినోత్సవం, ప్రధాని మోడీ సందేశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని జాగృతపరిచే క్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీనిని నిర్వహించుకుంటాయి. 1970 ఏప్రిల్ 22వ తేదీన మొదట ఎర్త్ డే నిర్వహించారు.

తొలుత ఐక్య రాజ్య సమితి 1969 మార్చిలో జాన్‌మెకెల్‌తో ప్రారంభించింది. అనంతరం అమెరికా రాజకీయవేత్త గేలార్డ్‌ నెల్సన్‌ ప్రారంభించారు. 1962లో సెనెటర్‌ నెల్సన్‌కి వచ్చి న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ధరిత్రీ దినోత్సవం. తన చుట్టూ ఉన్న వాతావరణం కలుషితమవడం గమనించి అందరికీ భూమి సంరక్షణ పట్ల అవగాహన కలిగించాలని అనుకున్నారు.

Earth Day 2018: Better Planet For Future Generations, Says PM Modi

1969లో అదే సెనెటర్‌ నెల్సన్‌కు ఓ ఆలోచన వచ్చింది. వాతావరణంలో జరిగే మార్పులనూ వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన వంతు ఏమి చెయ్యాలో అందరికీ తెలియ చెప్పడానికి ఒక రోజు అంటూ ఉంటే బాగుంటుందనుకున్నారు. అలా 1970 ఏప్రిల్‌ 22న మొదటి ధరిత్రీ దినోత్స వం జరిగింది. ఇది 48వ ఎర్త్ డే. కాగా, ధరిత్రీ దినోత్సవం సందర్భంగా గూగుల్ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రధాని సందేశం

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వాతావరణ పరిస్థితిలో వస్తున్న ఆందోళనకర మార్పులను తగ్గించేందుకు అందరం కలిసి కట్టుగా పని చేయాలని అభిప్రాయపడ్డారు. మన భవిష్యత్తు తరాల కోసం మంచి ప్లానెట్ కోసం చిత్తశుద్ధితో ఉందామని చెప్పారు. ఇది మన భూమాతకు గొప్ప నివాళి అన్నారు.

English summary
Earth Day turns 48 this Sunday, April 22, and Google is celebrating it with a Google Doodle of conservationist Dr. Jane Goodall, who nudges us in a video a “do our part for this beautiful planet.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X