వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వట్టిదే, భూమికి ఆస్టరాయిడ్ ప్రమాదం లేదు: నాసా

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వచ్చే నెలలో (సెప్టెంబర్) భూమిని ఆస్టరాయిడ్‌లు (గ్రహశకలం) ఢీకొంటుందనే ప్రచారం జరుగుతోంది. దీని పైన నాసా స్పందించింది. ప్రమాదకరమైన ఆస్టరాయిడ్లు భూమిని తాకే అవకాశాలు రానున్న వంద ఏళ్లలో 0.01 శాతం మాత్రమే ఉందని చెప్పారు.

సెప్టెంబర్ నెల 15, 28 తేదీల మధ్య కాలంలో భారీ గ్రహశకలం ఒకటి భూమిని తాకి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించవచ్చంటూ వచ్చిన వార్తలను నాసా కొట్టి పారేసింది. ఆ నెలలో ఖగోళానికి చెందిన వస్తువేదీ మన భూమిని ఢీకొడుతుందని చెప్పడానికి ఒక్క ఆధారమూ లేదని చెప్పింది.

సెప్టెంబర్ 15 నుంచి 28 మధ్య కాలంలో భారీ గ్రహశకలం ఒకటి భూమిని ఢీకొట్టవచ్చంటూ ఇటీవలి కాలంలో లెక్కలేనన్ని బ్లాగ్‌లు, వెబ్‌లలో తప్పుడు కథనాలు వచ్చాయని నాసా పేర్కొంది.

Earth not facing threat from asteroid

ఆ తేదీల్లో ఒక రోజున పోర్టారికో సమీపంలో గ్రహ శకలం భూమిని ఢీకొంటుందని, దాని ఫలితంగా అమెరికా, మెక్సికోలలోని అట్లాంటిక్ గల్ఫ్ తీరాలకు, అలాగే మధ్య, దక్షిణ అమెరికాలకు భారీ నష్టం సంభవించవచ్చని ఆ కథనాలు పేర్కొన్నాయి.

అయితే ఆ తేదీల్లో గ్రహ శకలం కానీ లేదా ఏదైనా ఖగోళ వస్తువు కానీ భూమిని తాకుతుందనేందుకు ఆధారాలు లేవని చెప్పింది. అంతేకాదు భూమికి దగ్గరగా ఉన్న వస్తువులను గుర్తించే కార్యక్రమం ప్రకారం సమీప భవిష్యత్తులో భూమిని తాకే గ్రహ శకలం కానీ, తోకచుక్క కానీ ఏదీ లేదు.

English summary
Earth not facing threat from asteroid
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X