వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తైవాన్‌లో భారీ భూకంపం..రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు

|
Google Oneindia TeluguNews

తైవాన్‌లో భారీ భూకంపం సంభవించినట్లు తైవాన్ వాతావరణ కేంద్రం తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్లు వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హుఆలిన్ నగర తూర్పు తీరానికి వాయువ్య దిశలో 10కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

తైవాన్ రాజధాని తైపేలో భూకంపం ధాటికి భవంతులు కదిలాయి. అంతేకాదు భూకంపం ధాటికి కొన్నిచోట్ల కొండచరియలు విరిగి పడినట్లు వీడియోల్లో కనిపించింది. భూకంపం తీవ్రతతో నివాస గృహాల్లో, కార్యాలయాల్లో ఫర్నీచర్ ధ్వసమైందని తైవాన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.

Earth quake hits Taiwan:6.1 recorded on Ritcher scale

పసిఫిక్ మహాసముద్రం పరిసరాల్లో ఉన్న తైవాన్ భూకంపాలకు కేంద్రబిందువుగా ఉంటోంది. ఈ ప్రాంతాన్ని రిమ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. తరుచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. 1999లో సంభవించిన భూకంపంలో దాదాపు 2,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గతేడాది ఫిబ్రవరిలో హుఆలియన్‌ నగరంలో సంభవించిన భూకంపంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

English summary
Taiwan's Central Weather Bureau says a strong 6.1 magnitude earthquake has struck the east of the island.The office said the quake happened just after 1 p.m. local time .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X