వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేషియా, జావాలో భారీ భూకంపం,రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు

|
Google Oneindia TeluguNews

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఒక గంట వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. తొలిసారిగా భూమి కంపించడంతో దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఇది జావా ద్వీపంలో సంభవించింది. గంట వ్యవధిలో మరో భూకంపం అదే తీవ్రతతో ఇండోనేషియాలో సంభవించింది. ఇది బాలి ద్వీపాన్ని తాకిందని యూరోపియన్ మెడిటెరేనియన్ భూకంప కేంద్రం తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ఇండోనేషియాలో జనాభా 260 మిలియన్ ఉంది. ఇక ఆ దేశంలో భూకంపాలు సర్వసాధారణం. అంతేకాదు భారీ అగ్నిపర్వతాలు కూడా తరుచూ విస్ఫోటనం చెందడం దాన్నుంచి పొంగిపొర్లే లావా, పొగ సమీపప్రాంతాలను చుట్టుముట్టుతుండటం సాధారణంగా కనిపిస్తాయి. ఇక ఈ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనంకు కారణం ఆ ప్రాంతం పసిఫిక్ తీరంలో ఉండటమే. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలుస్తారు.

Earthquake hits Indonesia and Java, intense recorded as 6.1 on Richter scale

ఈ ఏడాది మార్చిలో జావా ద్వీపంలో సంభవించిన భూకంపంలో నలుగురు మృతి చెందారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. 200కు పైగా ఇళ్లులు ధ్వంసమయ్యాయి. రాజధాని ప్రాంతం వరకు ఈ ప్రభావం కనిపించింది. గత నెలలో కూడా ఇండోనేషియాలో ఉదయం వేళల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

English summary
Two earthquakes in a span of one hour hit Java island and Indonesia. The first earth quake that struck Java was recorded at 6.1 on Richter scale, While the other earthquake hit indonesia with the same intensity. No casualities or damage have been reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X