వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్‌ను వణికించిన భూకంపం.. అర్ధరాత్రి వేళ జనం పరుగులు.. ఒకరు మృతి..

|
Google Oneindia TeluguNews

ఇరాన్‌లో శుక్రవారం తెల్ల‌వారుజామున 1:30 గంట‌ల‌కు భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 5.1గా న‌మోదైంది. ఈ ప్రమాదంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఒకరు మృతి చెందినట్టు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కియనుష్ జహన్‌పుర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా బలంగా కంపించిందని టెహ్రాన్ నివాసి ఒకరు తెలిపారు.ప్రజలంతా భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టి వీధుల్లోకి చేరుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం టెహ్రాన్‌కు ఈశాన్య దిశలో 55కి.మీ దూరంలో ఉన్న దమావంద్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 10కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అంచనా వేశారు.

earthquake hits Iran atleast one killed in tehran

Recommended Video

Coronavirus : Watch IAF's C-17 Globemaster Lands With Indian Pilgrims From Iran

ఇరాన్‌లో భూకంపాలు తరుచుగా సంభవిస్తూనే ఉన్నాయి. 1990లో వచ్చిన అతిపెద్ద భూకంపంతో 40వేల మంది ప్రజలు మృతి చెందారు. దాదాపు 3లక్షల మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై ఆ భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. పొరుగునే ఉన్న టర్కీలో ఈ ఏడాది ఫిబ్రవరి 23న సంభవించిన భూకంపంలో 9 మంది మృతి చెందారు. డిసెంబర్,జనవరి నెలల్లోనూ ఇరాన్‌లోని బుషెహర్‌ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు సమీపంలో రెండుసార్లు భూకంపం సంభవించింది.

English summary
At least one person was reported killed and seven others were injured, when a magnitude 5.1 earthquake hit northern Iran early on Friday (20:18 GMT on Thursday), according to the country's health ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X