వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ భారీ భూకంపం...రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు..సునామీ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

పపువా న్యూగినియా: పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశం ఉందని పసఫిక్ సునామీ హెచ్చరికా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సునామీ హవాయి ప్రాంతంలో కూడా వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అప్రమత్తతతో ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది సునామీ కేంద్రం. న్యూ బ్రిటెయిన్ ప్రాంతంలోని పపువా గినియా దీవిలో భూకంపం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని పేర్కొంది.

ప్రాథమిక నివేదిక ప్రకారం పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని తీరప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పపువా న్యూగినియాలో భూమి కంపించినట్లు సమాచారం. ఈ ప్రభావం భూకంపం కేంద్రీకృతమైన చోటు నుంచి 1000కిలోమీటర్ల దూరం వరకు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు.

Earthquake hits Papua New Guinea,Tsunami alerts issued

ఇక పసిఫిక్ సునామా కేంద్రం హెచ్చరించినట్లుగా భారీ అలలతో కూడిన సునామీ వస్తే విమానాశ్రయాలు, పోర్టులు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, హైడ్రో డ్యామ్‌లు ప్రమాదబారిన పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఆయా కేంద్రాలను అలర్ట్ చేసింది. పపువా న్యూగినియాలోని న్యూ ఐర్లాండ్, ఈస్ట్ న్యూ బ్రిటన్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఇక జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సురాలిల్, హితుంగ్, పాకాబాంగ్, సియామన్, వతారా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

English summary
A HUGE earthquake has rattled Papua New Guinea, sparking a tsunami threat for a large part of the Pacific Ocean - possibly including Hawaii.The 7.7 earthquake struck the island of New Ireland in Papua New Guinea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X