• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తర పాకిస్తాన్ లో తీవ్ర భూకంపం .. 26 మంది మృతి, 300 మందికి పైగాక్షతగాత్రులు

|

నిన్న భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీ వాసులు భూ ప్రకంపనలతో భయాందోళనకు గురయ్యారు. ఇక నిన్న ఇదే సమయంలో ఉత్తర పాకిస్తాన్లోనూ భూకంపం సంభవించి 26 మంది మరణించారు 300 మందికి పైగా గాయపడ్డారు. 5.8 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై నమోదైన భూప్రకంపనలు మంగళవారం పాకిస్తాన్ యొక్క ఉత్తర ప్రాంతాలలో, రాజధాని ఇస్లామాబాద్ తో సహా పలు నగరాలను కదిలించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

26 మంది మృత్యువాత .. 300 మందికి పైగా గాయాలు

26 మంది మృత్యువాత .. 300 మందికి పైగా గాయాలు

ఇక హోం శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శక్తివంతమైన భూకంపం కారణంగా మీరు మరియు పరిసర ప్రాంతాల్లో 26 మంది మృత్యువాత పడగా 300 మందికి పైగా గాయపడినట్లు గా తెలుస్తుంది.

పాకిస్థాన్లోని జీలం నది కి ఉత్తరాన 23 కిలోమీటర్ల మేర భూ ప్రకంపనలు సంభవించాయి .యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే తన నివేదికలో 5.8 గా భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై నమోదయ్యాయని పేర్కొంది. జీలం ఇస్లామాబాద్ కు ఆగ్నేయంగా 125 కిలోమీటర్ల ఈశాన్య పాకిస్తాన్ లో ఉంది. వివాదాస్పదమైన కాశ్మీర్ భూభాగంలో మీర్పూర్ పాకిస్తాన్ వైపు గా ఉంది. జీలం మరియు మీర్పూర్ ప్రాంతం మధ్యలో భూకంపం వల్ల ఎక్కువ నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది.

భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో ప్రాణ నష్టం లేదు

భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో ప్రాణ నష్టం లేదు

భారతదేశంలోని జమ్ము కాశ్మీర్, పంజాబ్ ,హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు రాజస్థాన్ లోని అనేక ప్రాంతాలలో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఆస్తి నష్టం మినహాయించి ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. భూకంప తీవ్రతతో మీర్పూర్ లో ఇళ్లు కూలిపోయాయి అని డిప్యూటీ కమిషనర్ రాజా కైసర్ తెలిపారు. రోడ్లు ద్వంసం అయ్యాయి. ప్రస్తుతం భూకంప తీవ్రతతో తీవ్ర నష్టం చవిచూసిన మీర్పూర్ లో ఎమర్జెన్సీని ప్రకటించామని పేర్కొన్నారు.

అప్రమత్తమైన పాక్ అధికార యంత్రాంగం .. మీర్పూర్ లో భారీ నష్టం

అప్రమత్తమైన పాక్ అధికార యంత్రాంగం .. మీర్పూర్ లో భారీ నష్టం

భూకంప తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు కావలసిన వైద్య సదుపాయాలను కల్పించడంతోపాటు గా, పునరావాస కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక ఆసుపత్రులలోనూ మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం మెడికల్ సపోర్ట్ టీంలను రంగంలోకి దింపింది.

నిన్న వచ్చిన భూకంప ప్రభావం మీర్పూర్ సమీపంలో ఉన్న పాకిస్తాన్ యొక్క ప్రధాన నీటి వనరు మంగ్లా ఆనకట్టమీద పడలేదని మంగ్లా బ్యారేజ్ సురక్షితంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

 రంగంలోకి దిగిన ఏవియేషన్ , ఆర్మీ

రంగంలోకి దిగిన ఏవియేషన్ , ఆర్మీ

భూకంప ప్రభావంతో 900 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిపివేస్తూ మంగ్లా డ్యాం పవర్ హౌస్ మూసివేయబడింది అని అధికారులు పేర్కొన్నారు. అత్యంత తీవ్రమైన భూప్రకంపనలతో జాతీయ విపత్తుగా భావించిన పాక్ ప్రభుత్వం ఈ విపత్తు నుండి ప్రజలకు బాసటగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఏవియేషన్, ఆర్మీ రంగంలోకి దిగింది.

English summary
At least 26 people were killed and more than 300 injured after a 5.8-magnitude earthquake jolted several cities in the northern parts of Pakistan, including capital Islamabad, on Tuesday. The tremors were felt in parts of India like Delhi and NCR region, Chandigarh, Dehradun and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X