వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌లో భారీ భూకంపం.. 7.1 తీవ్రతతో ప్రకంపనాలు..

|
Google Oneindia TeluguNews

కజికిస్తాన్, ఉత్తర భారతదేశంలో ప్రకంపనాలు వచ్చిన మరుసటి రోజే జపాన్‌లో భారీ భూకంపం సంభవిచింది. జపాన్‌లో శనివారం రాత్రి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.1గా ఉంది. మియాగి, ఫకసిమా, టొహోకు ప్రాంతంలో భూకంప ప్రభావం ఉంది. ఇదీ జపాన్‌లో రెండో అత్యంత భారీ భూకంపం అని అధికారులు తెలిపారు. ప్రకంపనాలు టోక్యో వరకు ప్రభావం చూపాయని వెల్లడించారు. అక్కడ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.08 గంటలకు 4 తీవ్రతతో ప్రకంపనాలు వచ్చాయని పేర్కొన్నారు. భూకంపంతో సునామీ హెచ్చరిక మాత్రం జారీచేయలేదని చెప్పారు.

భూకంపంతో ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగలేదని.. ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం, తీరం మధ్య దూరం ఉండటంతో ప్రభావం లేదని అధికారులు తెలిపారు. ఈటొరొఫు ద్వీపంలో భూకంప కేంద్రం ఉంది. దీనిపై జపాన్, రష్యా మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. భూకంపంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.

Earthquake of magnitude 7.1 strikes Japan

పరిస్థితిని ప్రధాని యోషిహిడే సుగా సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంత ప్రజలను తరలిస్తున్నామని పేర్కొన్నారు. భూకంప ప్రభావంతో దాదాపు 9.5 లక్షల మంది నిలువనీడ కోల్పోయారు. జపాన్‌లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా 6 అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాల్లో 20 శాతం ఇక్కడే వస్తాయి.

English summary
powerful earthquake of magnitude 7.1 on the Richter Scale struck the northern coast of Japan on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X