వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి వణికిస్తున్న ఎబోలా, కాంగోలో 17 మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

కాంగో: అత్యంత ప్రమాదకర ఎబోలా వైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. డెమోక్రటికి రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా కారణంగా 17 మంది మృతి చెందారు. ఎబోలా వల్ల పలువురు మృతి చెందారని, ఈ వైరస్ వ్యాప్తిస్తోందని, అందుకే అత్యయిక ఆరోగ్య స్థితి ప్రకటించామని ఆ దేశం ప్రకటించింది.

వైరస్ వ్యాప్తి నియంత్రణకు సిబ్బందిని రంగంలోకి దించారు. బికోరో పట్టణం సమీపంలోని ఓ గ్రామంలో వ్యాధి లక్షణాలతో 21 మంది ఆసుపత్రిలో చేరగా అందులో 17 మంది చనిపోయారు. ఆఫ్రికాలో ఎబోలా బయటపడటం ఇది తొమ్మిదోసారి. 1970లో దీనిని మొదటిసారి గుర్తించారు.

Ebola outbreak declared in Democratic Republic of Congo

రెండేళ్ల క్రితం పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాపించి ప్రపంచాన్ని భయపెట్టింది. గునియా, సియర్రా, లియోన్‌, లైబీరియా సహా పలు దేశాల్లో కలిపి 11,300 మంది చనిపోయారు. దాదాపు 28,600మందికి ఈ వైరస్‌ సోకడంతో చికిత్స పొందారు.

English summary
Seventeen people in northwest Democratic Republic of Congo (DRC) have died from Ebola, the health ministry said on Tuesday, describing the fresh outbreak as a "public health emergency with international impact."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X