వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నష్టం లక్షల కోట్లలో: అమెరికాకు బిగ్ డ్యామేజ్, తుఫాన్ల పేరు వెనుక కహానీ!

ఇందులో హరికేన్ తుఫాన్ కారణంగా 190 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లగా.. ఇర్మా కారణంగా 100 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: హరీకేన్ హార్వీ, ఇర్మా తుఫాన్లు అమెరికా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. వరుస తుఫాన్ల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోవడంతో ఉత్పత్తులన్ని నిలిచిపోయాయి. దానికి తోడు విపరీతమైన ఆస్తి నష్టం జరగడంతో.. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే దుస్థితి తలెత్తింది.

పెనుముప్పు: 15అడుగుల లోతులో మునిగిపోయే ప్రమాదం, తంపా వైపుగా ఇర్మాపెనుముప్పు: 15అడుగుల లోతులో మునిగిపోయే ప్రమాదం, తంపా వైపుగా ఇర్మా

రెండు వరుస తుఫాన్ల నేపథ్యంలో అమెరికా వాణిజ్య, ఆర్థిక నష్టాలను అక్కడి నిపుణులు లెక్క తేల్చారు. భవిష్యత్తులో తుఫాన్ల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. నష్టం మరింత పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు.

290మిలియన్ డాలర్ల నష్టం:

290మిలియన్ డాలర్ల నష్టం:

హరీకేన్ హార్వీ, ఇర్మా తుఫాన్ల కారణంగా ఇప్పటిదాకా అమెరికా 290 బిలియన్‌ డాలర్లు( రూ.18లక్షల కోట్లు) నష్టాన్ని చవిచూసింది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇది 1.5శాతంగా ఉండటం గమనార్హం. ఇందులో హరికేన్ తుఫాన్ కారణంగా 190 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లగా.. ఇర్మా కారణంగా 100 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అమెరికా జీడీపీ 19ట్రిలియన్ డాలర్లు కాగా.. అందులో హరీకేన్ హార్వీ నష్టం 1శాతం జీడీపీకి సమానం.

ఇలా లెక్క తేల్చారు:

ఇలా లెక్క తేల్చారు:

వ్యాపార-వాణిజ్య నష్టాలు, ఉత్పత్తి తగ్గదుల, కోల్పోయిన ఉద్యోగాలు, దెబ్బతిన్న రవాణా వ్యవస్థ , మౌలిక వసతుల, పంటనష్టం, ఇంధన ధరల పెరుగుదల, దెబ్బతిన్న ఇళ్లు, కోల్పోయిన విలువైన పత్రాలు ఇతరత్రా వాటన్నింటి ఆధారంగా నష్టాన్ని లెక్కగట్టారు. ఈ మొత్తం నష్టంలో భీమా సౌకర్యం కింద భర్తీ అయ్యేవి అతికొద్ది మాత్రమే.

తుఫాన్లకు ఎందుకా పేర్లు?:

తుఫాన్లకు ఎందుకా పేర్లు?:

తుపానులకు ఆండ్రూస్, హార్వే, ఇర్మా, జోష్ అంటూ మనుషుల పేర్లు పెట్టడంపై చాలామందికి సందేహాలున్నాయి. అయితే 1950నుంచి ఇదొక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. అంతకుముందు తుఫాన్లను గుర్తించడానికి ప్రత్యేకంగా పేరంటూ పెట్టేవారు కాదు. 1950ల నుంచే ఆ సంప్రాదాయం మొదలైంది. ఈ క్రమంలో 1953నుంచి సంభవించిన తుఫాన్లన్నింటికి మహిళల పేర్లు పెడుతూ వచ్చారు.

1979నుంచి పురుషుల పేర్లు:

1979నుంచి పురుషుల పేర్లు:

1979నుంచి మహిళల పేర్ల స్థానంలో పురుషుల పేర్లు చేరుస్తూ వచ్చారు. ఒక ఏడాది వ్యవధిలో సంభవించే తుపాన్లకు ఏయే పేర్లు పెట్టాలో సూచిస్తూ ప్రపంచ వాతావరణ సంస్థ ఒక జాబితాను విడుదల చేస్తుంది. వీటిల్లో ఎక్కువ నష్టాన్ని మిగిల్చే తుఫాన్ల పేర్లను వాటికే వదిలేసి.. మిగిలిన పేర్లను మాత్రం రిపీట్ చేస్తుంటారు. అలా ఈ సంవత్సరం ఉపయోగించే తఫానుల పేర్లను మళ్లీ 2023లో ఉపయోగిస్తారు.

English summary
The economic cost of Hurricane Irma could rise as high as $300bn (£227bn) as the storm lashes Florida, damaging homes, businesses and key crops including orange groves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X