వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మసీదుపై బాంబులు, కాల్పులు: 235 మంది మృతి
కైరో: ఈజిప్టులో ఓ మసీదును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 235 మంది మృతి చెందగా, 120 మంది వరకు గాయపడ్డారు.
ఉత్తర సినాయ్ ద్వీపకల్పంలో ఓ మసీదుకు ప్రార్థనలు చేసేందుకు వచ్చిన భక్తులను లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబులు విసిరి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన సందర్భంలో కాల్పులు జరిపినట్టు ప్రత్యక్షసాక్షులు, భద్రతా సిబ్బంది తెలిపారు.
కాల్పుల సమయంలో భక్తులు పరుగులు తీశారు. గాయపడ్డ వారిని అంబులెన్సులలో ఆసుపత్రుులకు తరలించారు. అంబులెన్సుల పైనా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!