వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రంలో కూలిన విమానం: 66మంది జలసమాధి

|
Google Oneindia TeluguNews

కైరో: ఈజిప్టు ఎయిర్స్ లైన్స్‌కు చెందిన ఓ విమానం అదృశ్యమవడం కలకలం సృష్టించింది. రాడార్ నుంచి సంకేతాలు అందకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈజిప్టు ఎయిర్ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది.

సదరు విమానం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నుంచి ఈజిప్టులోని కైరోకు బుధవారం రాత్రి 11గంటల ప్రాంతంలో 3గంటలకు కైరోకు చేరుకోవాలి. కానీ, ఆ విమానం గురించి ఎలాంటి సమాచారం లేదని, విమానం గమ్యస్థానం చేరలేదని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.

EgyptAir flight from Paris to Cairo disappears from radar: airline

ఈ విమానంలో మొత్తం 56మంది ప్రయాణికులు, 10మంది సిబ్బంది ఉన్నారని తెలిసింది. బుధవారం రాత్రి బయల్దేరిన ఈ విమానం సమాచారం ఇప్పటి వరకు అందలేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

గురువారం ఉదయం 2.45గంటలకు రాడార్ సంకేతాలు అందాయని, మరో 15 నిమిషాల్లో విమానం ల్యాండ్ అవుతుందనగా చివరిసారిగా తమకు రాడార్ సిగ్నల్స్ అందినట్లు ఈజిప్టు ఎయిర్ లైన్స్ వెల్లడించింది.

ఆ తర్వాత గమ్యస్థానం కేవలం 80 దూరంలో ఉండగా విమానం నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదని తెలిపింది.

సముద్రంలో కూలిన విమానం: 66మంది జలసమాధి

పారిస్‌ నుంచి ఈజిప్ట్‌ బయలుదేరిన ఈజిప్ట్‌ఎయిర్‌ విమానం ఎంఎస్‌ 804 మధ్యధరా సముద్రంలో కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. విమాన శకలాలను మెడిటరేనియన్‌ సముద్రంలో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.

విమానంలోని 66 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో 30 మంది ఈజిప్ట్‌కి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. మిగతావారు ఫ్రాన్స్‌, బ్రిటన్‌, సుడాన్‌, చాద్‌, పోర్చుగల్‌, అల్జీరియా, కెనడా, బెల్జియం, కువైట్‌, సౌదీ అరేబియాకు చెందినవారని అధికారులు పేర్కొన్నారు.

ఈజిప్టు సైనిక సిబ్బంది ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కొన్ని మృతదేహాలను వెలికితీశారు. గ్రీస్‌ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోందని ఈజిప్టు ఎయిర్‌ తెలిపింది.

English summary
An EgyptAir flight from Paris to Cairo with 69 people on board has vanished from radar, the airline said on its verified Twitter feed on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X