వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: హైజాకర్‌తో సెల్ఫీ! కిటికీ నుంచి దూకిన పైలట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కైరో: ఆత్మాహుతి జాకెట్ ధరించిన సీఫ్ ఎల్దిన్ ముస్తఫా అనే వ్యక్తి ఈజిప్ట్ విమానాన్ని హైజాక్ చేసి ఏడెనిమిది గంటల పాటు అందరిలోను ఆందోళన రేపాడు. ఈ హైజాక్ వ్యవహారం విమానంలోని ప్రయాణీకులనే కాకుండా, ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.

ప్రాణాలు అరచేత పట్టుకొని బందీలుగా ఉన్న వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇంతటి హైడ్రామా మధ్య బందీగా చిక్కిన ఓ ప్రయాణీకుడు ఏకంగా హైజాకర్‌తో సెల్ఫీ దిగాడట. ఆత్మాహుతి జాకెట్‌తో ఉన్న హైజాకర్‌తో అతను ఫోటో దిగడం విస్మయం కలిగిస్తోంది.

ఈ హైజాక్ సమయంలో పలు ఉత్కంఠభరితమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. లార్నాకలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఓ పైలట్ హైజాకర్ నుంచి తప్పించుకునేందుకు చిన్నపాటి సాహసం చేశాడు. విమానం ల్యాండ్ కాగానే అతడు కాక్ పిట్ కిటికీ నుంచి కిందకు దూకేశాడు.

ఈజిప్టులో మంగళవారం ఉదయం విమానం హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే తొలుత ఐసిస్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అందరూ భావించారు. కాగా, విమానం హైజాక్ అయిన మూడున్నర గంటల తర్వాత హైజాకార్ ఎవరో తెలియడంతో అంతా నివ్వెరపోయారు.

EgyptAir flight hijack: Hijacker Seif Eldin Mustafa arrested

ఉదయం 7 గంటల సమయంలో అలెగ్జాండ్రియా నుంచి ఈజిప్టు రాజధాని కైరో బయల్దేరిన ఈజిప్టు ఎయిర్ ప్లైట్ 181 విమానాన్ని గుర్తు తెలియని ఓ ఆగంతకుడు హైజాక్ చేశారు. మారణాయుధాలతో విమానంలోకి ఎక్కిన ఓ ఆగంతకుడు విమానాన్ని హైజాక్ చేసినట్లు ప్రకటించాడు.

ఆ ఆగంతకుడు ఎవరో కాదు ఈజిప్టు పౌరసత్వం కలిగిన వ్యక్తే. అంతేకాదు హైజాకర్‌ అలెగ్జాండ్రియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అతడి పేరు సైఫ్ ఈఐ డిన్ ముస్తఫా. అతడిని కొన్నాళ్ల కిందట భార్య వదిలేసింది. దీంతో ఆతడు తన భార్యను తీసుకొచ్చి చూపించాలని విమానాన్ని హైజాక్ అనంతరం డిమాండ్ చేశాడు. ఇలా హైజాక్ విషయంలో అన్నీ షాకింగ్ విషయాలు కనిపించాయి.

English summary
An Egyptian man who hijacked an EgyptAir flight to Cyprus was arrested on Tuesday, March 29, after hours of negotiations during which most passengers were freed and the last of the seven on board escaped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X