వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరో తెలిసింది: భార్య వదిలేసిందని విమానం హైజాక్, సుఖాంతం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కైరో: ఈజిప్టులో మంగళవారం ఉదయం విమానం హైజాక్‌కు గురైందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఐసిస్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అందరూ అనుకున్నారు. కాగా, విమానం హైజాక్ అయిన మూడున్నర గంటల తర్వాత హైజాకార్ ఎవరో తెలియడంతో అంతా నివ్వెర పోయారు.

ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో అలెగ్జాండ్రియా నుంచి ఈజిప్టు రాజధాని కైరో బయల్దేరిన ఈజిప్టు ఎయిర్ ప్లైట్ 181 విమానాన్ని గుర్తు తెలియని ఓ ఆగంతకుడు హైజాక్ చేశారు. మారణాయుధాలతో విమానంలోకి ఎక్కిన ఓ ఆగంతకుడు విమానాన్ని హైజాక్ చేసినట్లు ప్రకటించాడు.

ఆ ఆగంతకుడు ఎవరో కాదు ఈజిప్టు పౌరసత్వం కలిగిన వ్యక్తే. అంతేకాదు హైజాకర్‌ అలెగ్జాండ్రియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అతడి పేరు సైఫ్ ఈఐ డిన్ ముస్తఫా. అతడిని కొన్నాళ్ల కిందట భార్య వదిలేసింది. దీంతో ఆతడు తన భార్యను తీసుకొచ్చి చూపించాలని విమానాన్ని హైజాక్ అనంతరం డిమాండ్ చేశాడు.

EgyptAir hijacker identified, overtook plane due to ex-wife, officials say

దీంతో ఈ హైజాక్ డ్రామాకు తెర పడింది. ఈ విమాన హైజాక్ ఘటనపై సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనాస్టాసియాడెస్ మాట్లాడుతూ విమాన హైజాకింగ్ ఘటన ఉగ్రవాదుల పని కాదని స్పష్టం చేశాడు. అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తున్న ఈజిప్ట్ ఎయిర్ విమానం మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో హైజాక్ అయింది.

అనంతరం హైజాక్‌కు గురైన విమానాన్ని సిప్రస్‌లోని లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమానం హైజాక్‌కు గురైన సమయంలో అందులో 82 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో సిప్రస్ విమానాశ్రయాన్ని సాయుధులైన భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఎట్టి పరిస్థితుల్లో విమానం మరోసారి టేకాఫ్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వరాదని అధికారులు నిర్ణయించారు.

ఇదిలా ఉంటే, విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సైన్యమంతా వెనక్కు వెళ్లితే, మహిళలు, పిల్లలను విడిచిపెడతామని హైజాకర్ల నుంచి ఆఫర్ రావడంతో చుట్టుముట్టిన భద్రతా దళాలు వెనక్కు మళ్లాయి. ప్రస్తుతం హైజాకర్ నిర్భంధంలో ఐదుగురు విదేశీయులు, విమానం సిబ్బంది ఉన్నారు.

ఈజిప్ట్ ఎయిర్ ఓ ప్రకటనలో ప్రయాణికులను విడిచిపెట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఈ విమానంలో ఎనిమిది మంది బ్రిటన్ జాతీయులు, పది మంది అమెరికన్లు ఉన్నారు. అతడితో ఇంకా సంప్రదింపులు జరుపుతున్నామని, అందరినీ అతడు వదిలిపెట్టి విధంగా ప్రభుత్వాధికారులు చర్చలు జరుపుతున్నారు.

హైజాక్ కథ సుఖాంతం

ఈజిప్ట్ హైజాక్ కథ ఏడు గంటల అనంతరం సుఖాంతం అయింది. మాజీ భార్యను కలుసుకునేందుకే హైజాక్ చేసిన వ్యక్తి ఇంత డ్రామా ఆడినట్లుగా చెబుతున్నారు. హైజాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఉగ్రవాద కోణం లేదని స్పష్టం చేశారు.

English summary
An Egyptian presidential spokesman said the correct name of the EgyptAir Flight 181 hijacker is Seif El Din Mustafa, an Egyptian national. Earlier, the same spokesman said an Egyptian-American dual citizen of a different name was responsible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X