వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈజిప్టులో విమానం హైజాక్: డిమాండ్లు తెలియవు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కైరో: ఈజిప్టు విమానం హైజాక్‌కు గురైంది. వివరాళ్లోకి వెళితే మంగళవారం ఉదయం అలెగ్జాండ్రియా నుంచి ఈజిప్టు రాజధాని కైరో బయల్దేరిన ఈజిప్టు ఎయిర్ ప్లైట్ 181 విమానాన్ని గుర్తు తెలియని ఆగంతకుడు హైజాక్ చేశారు. మారణాయుధాలతో విమానంలోకి ఎక్కిన ఓ ఆగంతకుడు విమానాన్ని హైజాక్ చేసినట్లు తెలుస్తోంది.

విమానం హైజాక్‌కు గురైన సమయంలో అందులో 82 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో అత్యధికులు ఈజిప్ట్ వాసులేనని తెలుస్తోంది. దీంతో సిప్రస్ విమానాశ్రయాన్ని సాయుధులైన భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఎట్టి పరిస్థితుల్లో విమానం మరోసారి టేకాఫ్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వరాదని అధికారులు నిర్ణయించారు.

ఇదిలా ఉంటే, విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సైన్యమంతా వెనక్కు వెళ్లితే, మహిళలు, పిల్లలను విడిచిపెడతామని హైజాకర్ల నుంచి ఆఫర్ రావడంతో చుట్టుముట్టిన భద్రతా దళాలు వెనక్కు మళ్లాయని యూరోపియన్ యూనియన్ కమిషనర్ ఆండ్రువోలా వసిలియోవ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

హైజాకర్ల డిమాండ్ మేరకు పోలీసు బలగాలను ఉపసంహరించుకున్నారు. అనంతరం మహిళలు, చిన్నారులను వదిలేశారు. మధ్యాహ్నం దాకా 20 మందిని వదిలేశారు. ఈజిప్ట్ స్టేట్ రేడియోలో ఓ ఆగంతకుడు మారణాయుధాలతో విమానంలోకి ఎక్కినట్లు పేర్కొంది. అయితే విమానంలో మానవ బాంబు ఉందనే అనుమానం కలుగుతోందని పేర్కొంది.

అయితే ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
An Egyptian passenger plane has landed in Cyprus after reportedly being hijacked on its journey to Cairo. EgyptAir Flight 181 was was on a scheduled journey from Alexandria when it veered off course on Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X