వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియా శరణార్థుల కోసం దీవి కొనుగోలు: బిలియనీర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

టర్కీ సముద్రతీరంలో మూడేళ్ల పసిబిడ్డ నిర్జీవంగా పడిఉన్న హృదయ విదారక చిత్రం యావత్ ప్రపంచాన్నీ కదిలించిన సంగతి తెలిసిందే. సిరియా శరణార్ధుల దయనీయ పరిస్థితికి నిదర్శనంగా ఈ చిత్రం నిలిచింది. వారి దీన పరిస్థితిని చూసిన ఈజిప్టుకు చెందిన ఓ బిలియనీర్ మాత్రం సిరియా నుంచి వచ్చిన శరణార్ధుల కోసం, వారికి ఆశ్రయం కల్పించడానికి ఏకంగా ఓ ఐలాండ్‌నే కొనేందుకు ముందుకొచ్చాడు.

ఈజిప్టుకు చెందిన సావరీస్‌ ఒరాస్‌కామ్‌ టెలికాం నెట్‌వర్క్‌ అధినేత అత్యంత సంపనుల్లో ఒకడు సావరీస్‌. సిరియాలో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా వలస వెళుతూ ప్రాణాలు కోల్పోతున్న వారికోసం ప్రత్యేకంగా ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. అంతేకాదు గ్రీస్, ఇటలీలో ఉన్న ఖాళీగా ఉన్న దీవుల్లో ఒకదాన్ని అమ్మితే కోలుగోలు చేస్తానని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

Egyptian billionaire offers to buy island for refugees

ఆ ఐలాండ్‌లో వలస దారులకు ఇళ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు నిర్మించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు. దీవిని కొనుగోలు చేయడానికి దాదాపు 10 నుంచి వంద మిలియన్‌ డాలర్లు ఖర్చుచేసేందుకు సిద్ధమని కూడా ప్రకటించాడు. సిరియాలో పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఐలాండ్‌లో ఉండాలా వద్దా అన్న నిర్ణయం వారే తీసుకోవచ్చని స్పష్టం చేశాడు.

గ్రీస్, ఇటలీ ప్రభుత్వాలు ఐలాండ్ అమ్మడానికి సిద్ధమైతే, వెంటనే కోనుగోలుచేసి వలస వచ్చేవారికి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తానని తెలిపాడు. అంతేకాదు తాను కొనబోయే ఐలాండ్‌కు 'హ్యూమన్‌ బీయింగ్స్‌' అనే పేరు పెడతానని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న సిరియా శరణార్ధుల ఆదుకోవాడినికి ముందుకొచ్చిన సావరీస్‌ను ఆలోచనను అభినందిస్తున్నారు.

English summary
An Egyptian billionaire is offering to buy an island for people fleeing to Europe from war-torn countries in the Middle East and Africa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X