వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పురుషులు బలహీనులు! మహిళలు సెక్స్ కోర్కెలు తగ్గించుకోవాలి’

|
Google Oneindia TeluguNews

కైరో: ఈజిప్టు దేశంలో ఓ ప్రజాప్రతిని వింత వాదన తెరపైకి తీసుకొచ్చారు. తమ దేశంలోని పురుషులు లైంగికంగా బలహీనులని, వారు పడకగదిలో మహిళల కోరికను సంతృప్తికరంగా తీర్చలేరని చెప్పారు. అంతేగాక, అందుకు ఈజిప్టు మహిళలు తమ లైంగిక కోరికలు తగ్గించుకునేలా మర్మాంగానికి శస్త్రచికిత్స (ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్) చేయించుకోవాలని సెలవిచ్చారు.

ఆయనే సాక్షాత్తు ఆ దేశ ఎంపీ ఎల్హామీ ఎజీనా. మహిళలు మర్మాంగానికి ఆపరేషన్ చేసి పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించుకోవడం ద్వారా వారి కోరికలను తగ్గించుకోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.

Egyptian leader says 'men sexually weak',

దేశంలో పురుషులు లైంగికంగా బలహీనులు కావడం వల్ల వారు లైంగిక ఉత్తేజితాలను ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా మహిళల లైంగిక కోరికలు తగ్గించేందుకు వారి మర్మాంగాలకు ఆపరేషన్ లు చేయడాన్ని ఈజిప్టు ప్రభుత్వం 2008 వ సంవత్సరం నుంచి నిషేధించింది.

అలా ఆపరేషన్లు చేస్తే నేరంగా పరిగణిస్తామని కూడా ఈజిప్టు సర్కారు ప్రకటించింది కూడా. అయినా ఎల్హామీ ఎజీనా మహిళలు నిషేధిత శస్త్రచికిత్సలు చేయించుకోవాలని కోరడం వివాదాస్పదంగా మారింది.

English summary
An Egyptian lawmaker has said that women must undergo genital mutilation as the men in the country are sexually weak and cannot meet increased demands in the bedroom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X