వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్దెకు ఈఫిల్ టవర్, కానీ నెగ్గిన వారికి మాత్రమే

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్యారిస్: యూరో ఫుట్‌బాల్ - 2016 సందర్భంగా రెంటల్ కంపెనీ కస్టమర్లకు ఓ అద్భుత అవకాశాన్ని కల్పించింది. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌లో నాలుగు రోజుల పాటు నివసించేందుకు నలుగురు లక్కీ కస్టమర్లను ఓ పోటీ ద్వారా ఎన్నుకోనుంది.

ఇందుకో కోసం గురువారం నుంచి పోటీ ప్రారంభించినట్లు కంపెనీ సీఈవో బ్రియాన్ షార్పెల్స్ తెలిపారు. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కట్టడం ఉంది. దీనిలో పోటీ పడి నెగ్గిన వారికి హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేసే అవకాశం ఇచ్చారు.

 Eiffel Tower to Be Turned Into a Euro 2016 Rental Apartment

హోంఅవే అనే రెంటల్‌ కంపెనీ ఈఫిల్‌ టవర్‌లో మొదటి అంతస్థులో కొంతభాగం అద్దెకు తీసుకుంది. అయితే ఇందులో ఉండే అవకాశం దక్కాలంటే ఈ కంపెనీ పెడుతున్న పోటీలో నెగ్గాలి.

పోటీలో నెగ్గిన నలుగురు అదృష్టవంతులు వచ్చే నెలలో పారిస్‌లో జరిగే యూఈఎఫ్‌ఏ యూరో 2016 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ సమయంలో ఈఫిల్‌ టవర్‌లో బస చేసే అవకాశం లభిస్తుంది. ఇందుకోసం హోం అవే ఈఫిల్‌ టవర్‌లో 300 అడుగుల ఎత్తులోని మొదటి అంతస్థులో కొంత భాగాన్ని తాత్కాలికంగా నివాసయోగ్యంగా మారుస్తోంది.

English summary
Four lucky competition winners are set to be the first people in history to use the Eiffel Tower as a vacation home next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X