వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈఫిల్ టవర్ క్లోజ్: వీడియోలో ఏకే 47 బుల్లెట్ల వర్షం.. ప్రతీకారమే, మోడీ ఖండన

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఈఫిల్ టవర్‌ను మూసివేశారు. చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయం పైన సాయుధ దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈఫిల్ టవర్‌ను మూసేశారు.

ఫ్రాన్స్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రతా చర్యల్లో భాగంగానే ఈఫిల్ టవర్ మూసివేసినట్లు ఫ్రాన్స్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చార్లీ హెబ్టో పత్రిక కార్యాలయం పైన దాడి నేపథ్యంలో మిగతా పత్రికల సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కాల్పుల దృశ్యాలు అక్కడే ఉన్న వీడియోలో కనిపించాయి.

సెకన్లలో బుల్లెట్ల వర్షం.. టేబుళ్ల కింద దాక్కున్నారు

Eiffel Tower closed, PM Modi condemns Paris attack, says it is despicable act

చార్లీ హెబ్డో కార్యాలయం పైన దాడి చేసిన దుండగులు ఇద్దరు కాకుండా ముగ్గురు ఉన్నారని తెలుస్తోంది. సాయుధ దుండగులు సెకన్ల వ్యవధిలో ఏకే 47 రైఫిళ్లతో బుల్లెట్ల వర్షం కురిపించారని సిబ్బంది చెబుతోంది. తమ పైన కాల్పులు జరిపిన అనంతరం వారు బయటకు వెళ్లి అక్కడ కారులో పారిపోయారన్నారు. తమలో అనేక మంది టేబుళ్ల కింద దాక్కొని ప్రాణాలు దక్కించుకున్నట్లు చెప్పారు. మరికొందరు భవనం పైకి వెళ్లారు.

అవమానించినందుకు..

ఉగ్రవాదుల దాడిలో చార్లీ హెబ్డో మేగజైన్ న్యూస్ డైరెక్టర్ స్టీఫెన్ షార్పోనియర్ మృతి చెందారు. ప్రముఖ ఫ్రెంచ్ కార్టూనిస్టులు కాబూ, చార్భ్, వోలినిస్కీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. స్టీఫెన్‌‍ను హతమారిస్తే భారీగా నగదు బహుమతి ఇస్తామని అల్ ఖైదా 2013లో ప్రకటించింది. కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఫ్రెంచిలో మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నామంటూ నినాదాలు చేశారట. ఉగ్రవాదుల కోసం ప్యారీస్‌లో జల్లెడ పడుతున్నారు. రవాణా వ్యవస్థను నిలిపేశారు.

ఖండించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ

ప్యారిస్‌లో ఉగ్రవాద దాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చర్య హేయమైనదన్నారు. పత్రికా కార్యాలయంలో జరిగిన ఈ దాడిలో మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.

ఐక్యంగా పోరాడాలి: అరుణ్ జైట్లీ

ప్యారిస్‌లో ఉగ్రవాదుల చర్య అత్యంత నీచమైనదని, అది మానవత్వం పైన దాడి అని భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఏకమై ఉగ్రవాదంపై పోరాడాల్సి ఉందన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Wednesday denounced the attack in Paris, terming it as "condemnable and despicable" act, and said India's solidarity is with the people of France.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X