వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంజాన్ సెల‌వుల విషాదం: దుబాయ్‌లో రోడ్డు ప్ర‌మాదం: 8 మంది భార‌తీయులు దుర్మ‌ర‌ణం

|
Google Oneindia TeluguNews

దుబాయ్: రంజాన్ సెల‌వులు విషాదాన్ని మిగిల్చాయి. 17 మందిని పొట్ట‌న పెట్టుకున్నాయి. ఈ 17 మందిలో ఎనిమిది భార‌తీయులే. రంజాన్ సెల‌వులు ముగించుకుని స్వ‌స్థ‌లానికి తిరిగి వ‌స్తున్న వారి వాహ‌నం రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో ఎనిమిది మంది భార‌తీయుల‌తో పాటు 17 మంది ప్ర‌యాణికులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో అయిదుమంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దుబాయ్‌లో ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతులంద‌రూ జీవ‌నోపాధిని వెదుక్కుంటూ దుబాయ్‌కు వెళ్లిన వారేన‌ని స్థానిక అధికారులు నిర్ధారించారు.

రంజాన్ పండ‌గ సంద‌ర్భంగా గల్ఫ్ దేశాల్లో అయిదురోజుల పాటు సెల‌వును ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీనితో దుబాయ్‌కు చెందిన సుమారు 31 మంది ఓ ప్రైవేటు బ‌స్సులో విహార‌యాత్ర కోసం పొరుగునే ఉన్న ఒమ‌న్‌కు వెళ్లారు. ఒమ‌న్ నుంచి గురువారం మ‌ధ్యాహ్నం వారు దుబాయ్‌కి తిరుగుముఖం ప‌ట్టారు. వారు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు సాయంత్రానికి దుబాయ్ శివార్ల‌కు చేరుకుంది. షేక్ మొహ‌మ్మ‌ద్ బిన్ జ‌యేద్ రోడ్డుపై ప్ర‌యాణిస్తున్న బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. ఎదురుగా వ‌స్తోన్న మ‌రో వాహ‌నాన్ని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న 17 మంది అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

 Eight Indians, returning from Oman after Eid hoildays, among 17 killed in Dubai bus accident

మృతుల్లో ఎనిమిది మంది భార‌తీయులు ఉన్నారు. వారిని రాజ‌గోపాల‌న్‌, దీప‌క్ కుమార్‌, జ‌మాలుద్దీన్ అర‌క్క‌వీట్టిల్‌, కిర‌ణ్ జానీ, వాసుదేవ్‌, తిల‌క్‌రామ్, జ‌వ‌హ‌ర్ ఠాకూర్‌గా గుర్తించారు. మృతుల్లో న‌లుగురు త‌మిళ‌నాడు, కేర‌ళ‌కు చెందిన వారు. మ‌రో అయిదుమంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారిని స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారికి అత్య‌వ‌స‌ర చికిత్స‌ను అందిస్తున్నారు. మృతుల్లో మిగిలిన వారు కూడా వివిధ దేశాల నుంచి దుబాయ్‌కు వ‌ల‌స వ‌చ్చిన వారేన‌ని అధికారులు తెలిపారు.

English summary
As many as eight Indians died in a bus accident in Dubai Thursday evening, the Consulate General of India (CGI) in Dubai has confirmed. A total of 17 people were killed and five were criticially injured when the bus returning from Oman after Eid holidays met with an accident at Sheikh Mohammed bin Zayed Road Thursday evening. The Indians who died in the accident were identified as Rajagopalan, Feroz Khan Pathan, Reshma Feroz Khan Pathan, Deepak Kumar, Jamaludeen Arakkaveettil, Kiran Johnny, Vasudev, and Tilakram Jawahar Thakur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X