వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏనుగుల అందాల పోటీల్లో అపశ్రుతి.. ఓ ఏనుగు రచ్చ.. 18 మందికి గాయాలు..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఓ ఏనుగు రచ్చ.. 18 మందికి గాయాలు..! (వీడియో)

కొలంబో : శ్రీలంకలో ప్రతి సంవత్సరం ఏనుగుల అందాల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బౌద్ధ మతస్తులు నిర్వహించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తుంది. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా నిర్వహించిన ఏనుగుల అందాల పోటీలో అపశృతి జరిగింది. ఏనుగులను అందంగా ముస్తాబు చేసి ఊరేగిస్తున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

సర్పంచ్ స్థాయి నుంచి మచ్చ లేని వ్యక్తినంటూ.. మంత్రి పదవి రాక రామన్న కంట తడి..!సర్పంచ్ స్థాయి నుంచి మచ్చ లేని వ్యక్తినంటూ.. మంత్రి పదవి రాక రామన్న కంట తడి..!

అందంగా ముస్తాబైన ఏనుగులను ఊరేగిస్తున్న సమయంలో అందులో ఒక ఏనుగు బీభత్సం సృష్టించింది. అంతటితో ఆగకుండా జనాలపై విరుచుకుపడింది. అప్పటివరకు ఏనుగుల అందాల పోటీ తిలకించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏనుగు ఉగ్రరూపం దాల్చడంతో పరుగు లంకించుకున్నారు. ఈ ఘటన శ్రీలంక రాజధాని కొలంబో సమీపంలోని కొటే పట్టణంలో జరిగింది.

Elephant injures 18 members in Sri Lanka Buddhist pageant

ఏనుగుల అందాల పోటీలను తిలకించేందుకు వచ్చిన వారంతా బతుకు జీవుడా అంటూ ఉరుకులు పెట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. అయినా కూడా కొందరు ఏనుగు బీభత్సానికి బలయ్యారు. దాని కోపం కట్టలు తెంచుకుని కనిపించిన వారందరినీ ఇష్టం వచ్చినట్లుగా తొక్కేసింది.
ఆ ఏనుగు దాడిలో 18 మంది గాయపడ్డారు. ఏనుగుపై ఉన్న మావటి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఏనుగు దాడిలో గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 18 మందిలో 16 మందికి తగిన చికిత్స అందించి ఇంటికి పంపించారు డాక్టర్లు. మరో ఇద్దరికి మాత్రం ఇంకా వైద్యం అందిస్తున్నారు. ఏనుగు బీభత్సానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

English summary
An elephant taking part in a Buddhist pageant in Sri Lanka has run berserk, injuring at least 18 people. Saturday night's pageant in Kotte, near Sri Lanka's capital. The procession begins after a government minister places a sacred relic on a decorated casket atop an elephant adorned with shiny red clothing. A few minutes later, another elephant runs forward, forcing terrified people to scatter, some of whom run into an elephant walking at the front of the procession. The elephant that was hit becomes violent and runs, pushing onlookers. A man riding on the elephant falls off and narrowly escapes being trampled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X