వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Must Read:చిన్న చిప్‌తో బ్రెయిన్ సమస్యలకు చెక్...ఎలన్ మస్క్ సంస్థ నుంచి మరో అద్బుతం

|
Google Oneindia TeluguNews

మానవుడి మెదడుకు కంప్యూటింగ్ డివైస్‌కు మధ్య అనుసంధానంపై గత కొన్నేళ్లుగా ప్రయోగాలు చేపడుతోంది ఎలన్ మస్క్ వ్యవస్థాపించిన న్యూరాలింక్ సంస్థ. ఈ క్రమంలోనే కంపెనీ ఈ ఇంటర్‌ఫేస్‌కు సంబంధించిన టెక్నాలజీని ఒక డెమో ద్వారా వివరించింది. అయితే ఈ డెమో ప్రమోషన్‌కు కాదని కేవలం తమ సంస్థలో పనిచేసేందుకు కావాల్సిన సిబ్బంది నియామకం కోసమే అని స్పష్టం చేశారు ఎలన్ మస్క్.

 డెమో నిర్వహించిన ఎలన్ మస్క్

డెమో నిర్వహించిన ఎలన్ మస్క్

న్యూరాలింక్ సంస్థలో పనిచేసేందుకు ఉత్సాహం ఉన్న వారికోసమే ఈ డెమో నిర్వహిస్తున్నామని ఎలన్ మస్క్ చెప్పారు. అంతేకాదు ఈ టెక్నాలజీపై పనిచేసి తమ కలలను సాకారం చేసే వారికోసం సంస్థ ఎదురుచూస్తోందని వివరించారు. మానవుడి మెదడుకు కంప్యూటింగ్ డివైస్‌కు అనుసంధానంగా ఉండే ఈ ప్రాడక్ట్‌ అందుబాటు ధరలోనే ఉంచి అవసరమైన వారికి ఒకటి అందివ్వాలని తమ సంస్థ భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికీ మెదడు సంబంధిత జబ్బులు ఉంటాయని చెప్పిన మస్క్ అందులో జ్ఞాపకశక్తిని కోల్పోవడం, బ్రెయిన్ డ్యామేజ్, మానసికంగా కృంగిపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితానే తయారవుతుందన్నారు. అయితే ఈ వ్యాధులు స్వల్పకాలంలోనే తగ్గిపోతాయని కచ్చితంగా చెప్పలేమన్నారు. అయితే తాము తయారు చేసిన టెక్నాలజీ ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతుందేమో అన్న చిన్న ఆశతో దీన్ని డెవలప్ చేసినట్లు చెప్పారు.

 పందులపై ప్రయోగం

పందులపై ప్రయోగం

ఇది మెడికల్ ఫీల్డ్‌లో పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉండగా... మస్క్ డెమోలో చూపింది చాలా తక్కువ. న్యూరాలింక్ సంస్థ ఒక పరికరం తయారు చేస్తున్నామని గతేడాది ప్రకటించింది. ఈ క్రమంలోనే ఓ పరికరాన్ని చూపిన మస్క్... దీన్ని వెంట్రుకల కింద జాగ్రత్తగా అమర్చాలని చెప్పారు. ఆ పరికరం సైజ్ కూడా మస్క్ చూపించారు. ఇక ఈ డెమోను మూడు పందులపై చూపించాడు. అందులో ఒక పందికి ఎలాంటి చికిత్స ఇవ్వలేదు. రెండో పందికి లింక్ అనే న్యూరోలింక్ పరికరం అమర్చారు. మూడో పందికి ముందుగా అమర్చిన పరికరం తర్వాత తీశారు. అయితే ఈ డెమో సందర్భంగా మూడో పందికి అప్పటికే అమర్చిన లింక్ పరికరంను తొలగించడం ద్వారా అది ఆరోగ్యంగా, సాధారణంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక పరికరం అమర్చిన పంది ఆహారం కోసం వెతుకులాడుతుండగా ఆ ఎదురైన వస్తువులను తాకిన సమయంలో ఒక శబ్దంతో కూడిన విజువల్ వస్తుండటాన్ని ప్రేక్షకులకు చూపించారు.

Recommended Video

#MukeshAmbani : ప్రపంచ సంపన్నుల జాబితాలో 5వ స్థానానికి ముఖేష్ అంబానీ! || Oneindia Telugu
 ఫోన్‌తో కూడా అనుసంధానం కావాలి

ఫోన్‌తో కూడా అనుసంధానం కావాలి

ఇక ఈ పరికరంను వివరిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ పరికరాన్ని ఫోన్‌కు కూడా కనెక్ట్ చేయొచ్చని చెప్పారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఇక దీని కమ్యూనికేషన్ వ్యవస్థ బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుందని చెప్పారు. తలలో అమర్చిన పరికరం కూడా బ్లూటూత్‌తో పనిచేస్తుందని చెప్పారు. ఇక జూలైలో దీనికి అన్ని అనుమతులు వచ్చాయని చెప్పారు. ఇక న్యూరలాజికల్ సమస్యలను అధిగమించాలన్న యోచనతోనే ఈ పరికరాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పిన మస్క్... పందులపై ఈ ప్రయోగంను చేసినట్లు తెలిపారు.ఇక ఈ డివైస్ కొన్ని వేల డాలర్లకే అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తామని ఎలన్ మస్క్ చెప్పారు.

English summary
Elon Musk -founded Neuralink has made headlines over the past many years around it efforts to develop a new kind of interface between the human brain and computing devices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X