వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Elon Musk :భూగ్రహంపై అత్యంత ధనికుడు..రెండో స్థానంకు అమెజాన్ అధినేత

|
Google Oneindia TeluguNews

ఎలన్ మస్క్... ఓ అసాధారణమైన బిజినెస్ మ్యాన్. టెస్లా.. స్పేస్ ఎక్స్ సంస్థల సక్సెస్ స్టోరీ వెనక ఉన్న మేధావి. ప్రస్తుతం నెట్టింట్లో ఎలన్ మస్క్ పేరు మారుమోగుతోంది. ఎందుకంటే ఈ గ్రహంపైనే అత్యంత ధనికుడిగా ఆవిర్భవించాడు. ఎలన్‌ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ తయారీ సంస్థ షేర్ వాల్యూ 4.8శాతం పెరిగింది. దీంతో అప్పటి వరకు అత్యంత ధనికుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్‌ బెజోస్‌ను వెనక్కి నెట్టేసి తొలిస్థానంలో నిలిచారు ఎలన్ మస్క్.

దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ అపరమేధావి ఎలన్ మస్క్ నికర ఆస్తులు అమెరికా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 :15 నిమిషాలకు 188.5 బిలియన్ డాలర్లకు చేరడంతో... అక్టోబర్ 2017 నుంచి తొలిస్థానంలో ఉన్న జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టేసి ఆ స్థానం కైవసం చేసుకున్నాడు . ఇక పారిశ్రామిక రంగంలో కూడా జెఫ్ బెజోస్‌కు గట్టి ప్రత్యర్థిగా నిలిచారు ఎలన్ మస్క్. 12 నెలల సమయంలో ఎలన్ మస్క్ ఆస్తులు 150 బిలియన్ డాలర్లు మేరా పెరిగాయి.అంతేకాదు ఏడాది సమయంలో ఇంత భారీ స్థాయిలో సంపద పెరగడం చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. ఇందుకు ప్రధాన కారణం టెస్లా షేర్ ధర గతేడాది 743శాతం మేరా పెరిగి అప్పటి నుంచి స్థిరమైన లాభాలను నమోదు చేయడమే అని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

Elon musk

గతేడాది టెస్లా సంస్థ నుంచి కేవలం 5 లక్షలు కార్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. అంటే ఫోర్డ్ మోటార్ కంపెనీ, మరియు జనరల్ మోటార్ కంపెనీలు ఏడాదిలో తయారు చేసే కార్ల ఉత్పత్తిలో ఇది చాలా తక్కువ. అంతేకాదు అమెరికాలో కొత్తగా రానున్న డెమొక్రాట్ల ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్ల వైపే మొగ్గు చూపుతుండటంతో... భవిష్యత్తులో ఈ వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో అమాంతంగా ఈ సంస్థ యొక్క షేర్ ధర పెరిగిపోయింది.

ఇదిలా ఉంటే సంపద పెరుగుదలలో ప్రపంచదేశాల్లోని టాప్ 500 మంది ధనికులంతా గతేడాది తమ నికర ఆస్తుల కంటే 1.8 ట్రిలియన్ డాలర్లు ఈ ఏడాది ఎక్కువగా సంపాదించారు. అంటే గతేడాది ఆస్తులతో పోలిస్తే ఈ సారి 31శాతం అధికంగా సంపాదించారు.

English summary
Elon Musk the CEO of Tesla and Space x company have reached the top spot in the world's richest persons surpassing Jeff Bejos of Amazon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X