వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థాయ్‌ గుహల వద్ద ఎలన్ మస్క్...సహాయక చర్యల కోసం చిన్న జలాంతర్గామి

|
Google Oneindia TeluguNews

అమెరికాకు చెందిన అంతరిక్ష పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ థాయ్‌లాండ్‌కు చేరుకున్నారు. థాయ్‌లాండ్ గుహల్లో చిక్కుకుపోయిన బాలురను రక్షించేందుకు తన వంతు కృషి చేసేందుకు వచ్చారు. పిల్లలను కాపాడేందుకు మినీ సబ్ పరికరాన్ని కూడా మస్క్ తనవెంట తీసుకొచ్చారు. మూడవ గుహను చూసి వచ్చినట్లు మస్క్ పేర్కొన్నారు. పిల్లలను క్షేమంగా తీసుకొచ్చేందుకు తమ కంపెనీ రూపొందించిన మినీ సబ్ అవసరం పడుతుందేమోనని దాన్ని అక్కడే విడిచి వచ్చినట్లు మస్క్ చెప్పారు.

Recommended Video

ఆపరేషన్‌లో పాల్గొన్న విదేశీయులు

మినీ సబ్ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుతుందని వివరించిన ఎలన్ మస్క్...అది రాకెట్‌ను తయారు చేసే భాగాలతో రూపొందించినట్లు మస్క్ వెల్లడించారు. ఈ పరికరానికి పిల్లల ఫుట్‌బాల్ టీమ్ పేరు వైల్డ్ బోర్ అని నామకరణం చేశారు. పిల్లలను కాపాడేందుకు గుహ దగ్గరకు వెళ్లిన డైవర్స్‌ వీడియోను ఎలన్ మస్క్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Elon musk reaches Thai caves site, posts videos on Instagram

మూడవ గుహ మొదటి గుహ ప్రారంభం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. పిల్లలను రక్షించేందుకు వెళ్లిన డైవర్స్‌ కూడా మూడో గుహనే ఆధారంగా చేసుకుని తమ రెస్క్యూ ఆపరేషన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే పిల్లలు మూడవ గుహ నుంచి ఇంకా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడం కష్టసాధ్యంగా మారింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలంవెళ్లదీస్తున్నారు చిన్నారులు.

Elon musk reaches Thai caves site, posts videos on Instagram

అయితే ఎలన్ మస్క్ రూపొందించిన పరికరాన్ని థాయ్ డైవర్స్ వినియోగిస్తారన్న సంకేతాలు ఇప్పటికైతే లేవు. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి సమయానికల్లా ఎనిమిది మంది పిల్లలను సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల అక్కడికి వచ్చి థాయ్ అధికారులకు తమ సహకారాన్ని అందిస్తున్నారు.

పిల్లలను కాపాడేందుకు వెళ్లిన ఓ థాయ్ అధికారి గుహలో ఆక్సిజన్ అందక మృతి చెందాడు. మస్క్ కంపెనీ తయారు చేసిన పరికరం వినియోగిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంది. పరికరం పెద్దగా బరువు కూడా ఉండదని, చిన్న చిన్న రంద్రాల్లో నుంచి కూడా వెళ్లగలదని మస్క్ వివరించారు. అంతేకాదు ఈ పరికరంలో ఉన్న వ్యక్తి ఈదాల్సిన అవసరం లేదు... ఆక్సిజన్ ఎలా వాడాలో తెలియాల్సిన అవసరం లేదన్నారు.

English summary
American space entrepreneur Elon Musk tweeted that he was in Thailand on Tuesday with a prototype mini-sub, at the flooded cave where five members of a youth football team remained trapped.He said that he left the mini submarine there it self for future use. He also posted a video on instagram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X